ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘సూపర్‌ పోలీస్‌’ కాదు..

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:46 PM

తమ దృష్టికి వచ్చే అన్నింటినీ విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ‘సూపర్‌ పోలీస్‌’ కాదని మద్రాసు హైకోర్టు ఖండించింది. 2006లో నేలబొగ్గు కేటాయింపులో జరిగిన అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో, నగరానికి చెందిన ఆర్కేఎం పవర్‌జెన్‌ సంస్థకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదుచేసింది.

- హైకోర్టు

చెన్నై: తమ దృష్టికి వచ్చే అన్నింటినీ విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ‘సూపర్‌ పోలీస్‌’ కాదని మద్రాసు హైకోర్టు(Madras High Court) ఖండించింది. 2006లో నేలబొగ్గు కేటాయింపులో జరిగిన అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో, నగరానికి చెందిన ఆర్కేఎం పవర్‌జెన్‌ సంస్థకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదుచేసింది. అలాగే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కేసు నమోదుచేసింది.

ఈ కేసులో సీబీఐ(CBI) దాఖలుచేసిన అదనపు నివేదిక ఆధారంగా జనవరిలో ఆర్కేఎం పవర్‌జెన్‌ సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఈడీ, ఈ సంస్థకు చెందిన రూ.901 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్తంభింపజేసింది. ఈడీ చర్యలకు వ్యతిరేకంగా ఆర్కేఎం సంస్థ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎంఎస్‌ రమేష్‌,

వి.లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం విచారించి జారీ చేసిన ఉత్తర్వుల్లో... ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదు. తమ దృష్టికి వచ్చే ప్రతిదానిని దర్యాప్తు చేసేందుకు ఈడీ సూపర్‌ పోలీస్‌ కాదని ఖండిస్తూ, సంస్థ డిపాజిట్లు స్తంభింపజేస్తూ జారీచేసిన ఈడీ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..

జోరుగా వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 22 , 2025 | 12:46 PM