AI Techie Suicide: ఓలా కృత్రిమ్ ఉద్యోగి ఆత్మహత్య.. సంస్థలో కలకలం
ABN, Publish Date - May 19 , 2025 | 08:02 AM
ఓలా కృత్రిమ్‌లో పనిచేస్తున్న ఓ యువ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పని సంస్కృతి, ఉద్యోగులపై పని ఒత్తిడి తదితర అంశాలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓలా ఆధ్వర్యంలోని ఏఐ సంస్థ కృత్రిమ్‌లో పనిచేస్తున్న ఓ యువ టెకీ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. కంపెనీలో పని సంస్కృతి, పని ఒత్తిడి తదితర అంశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృత్రిమ్‌లో ఏడాదిగా పనిచేస్తున్న యువ టెకీ నిఖిల్ సోమవంశీ మే 8న ఆత్మహత్యకు పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. ఇటీవలే అతడు ఐఐఎస్‌సీలో చదువు పూర్తి చేసుకున్నాడు. అతడి మరణంపై మరో రెడిట్ యూజర్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవంశీ ఫ్రెషర్ అయినప్పటికీ ఓ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నాడని సదరు యూజర్ చెప్పుకొచ్చారు. తనతో పాటు ప్రాజెక్టులో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు తప్పుకోవడంతో పని భారం మొత్తం సోమవంశీపైనే పడింది. మీటింగ్స్ సమయాల్లో టీం మేనేజర్ ఉద్యోగులపై విరుచుకుపడే వాడని తెలిపారు. చిన్న చిన్న సూచనలు చేసేందుకు కూడా నానా రభసా చేసేవారని సంస్థలో గతంలో పనిచేసి కొందరు కామెంట్ చేశారు.
ఉద్యోగి మరణంపై ఓలా కూడా స్పందించింది. అతడు వ్యక్తిగత లీవ్‌లో ఉండగా ఇలా జరిగిందని పేర్కొంది. ఏప్రిల్ 8న లీవ్ కోరగా వెంటనే మంజూరు అయ్యిందని తెలిపింది. ఆ తరువాత ఏప్రిల్ 17న సెలవు పొడిగింపు కోరగా ఆమోదించినట్టు వెల్లడించింది. నిఖిల్ తమ సంస్థకు ఎంతో విలువైన ఉద్యోగి అని పేర్కొంది. నిఖిల్ కుటుంబానికి సహోద్యోగులకు అండగా ఉంటామని పేర్కొంది.
సోమవంశీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతడికి తన థీసిస్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్, రిట్రీవ్ ఆగ్మెంటెడ్ జనరేషన్ మేడ్ చాట్‌బాట్ సాథీపై పనిచేసిన అనుభవం ఉంది. ప్రభుత్వ పథకాలు స్థానిక భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐఎస్‌సీ బెంగళూరు, ఆక్సఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, అకైకే టెక్నాజీస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టాయి. మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది.
ఇవీ చదవండి:
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 08:08 AM