ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolipalya Gang: ఇంటి బయట న్యూస్ పేపర్ కనిపించిందా.. ఇళ్లు నాశనం చేస్తారు..

ABN, Publish Date - May 26 , 2025 | 07:54 PM

Kozhipalya Gang: ఆ గ్యాంగ్ పేరు కోలిపాళ్య గ్యాంగ్.. కెప్టెన్ దేవ్‌రాజ్ ఈ గ్యాంగుకు బాస్. ఇతడు ప్లాన్ వేస్తే.. ఫెయిల్ అవ్వటం అన్నది జరగదు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతూ ఉండేది. ఇంటి బయట రెండు రోజుల పేపర్లు కనిపిస్తే.. ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేసేది.

Kozhipalya Gang

దండుపాళ్య గ్యాంగ్ గురించి మీరు వినే ఉంటారు. దశాబ్దం క్రితం కర్ణాటక ప్రజలకు నిద్ర లేకుండా చేసిన గ్యాంగ్ ఇది. ఈ గ్యాంగ్ ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఎంతో మందిని చంపింది. ఈ గ్యాంగ్ ఇంట్లో దొంగతనానికి వచ్చి ఆ ఇంట్లో వారిని అత్యంత క్రూరంగా గొంతులు కోసి చంపేది. ఆ తర్వాత ఈ గ్యాంగ్ పోలీసులకు చిక్కటం.. జైలు పాలవ్వటం జరిగింది. ఈ గ్యాంగ్‌పై సినిమాలు కూడా వచ్చాయి. ఈ దండుపాళ్య గ్యాంగ్‌లాగే కొత్తగా ఓ గ్యాంగ్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త గ్యాంగ్ హత్యలు చేయదు కానీ.. ఇంటిని మాత్రం పక్కా ప్లాన్‌తో దోచేస్తుంది.


ఆ గ్యాంగ్ పేరు కోలిపాళ్య గ్యాంగ్.. కెప్టెన్ దేవ్‌రాజ్ ఈ గ్యాంగుకు బాస్. ఇతడు ప్లాన్ వేస్తే.. ఫెయిల్ అవ్వటం అన్నది జరగదు. కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతూ ఉండేది. ఇంటి బయట రెండు రోజుల పేపర్లు కనిపిస్తే.. ఆ ఇంటిని టార్గెట్ చేసి దొంగతనం చేసేది. కోలిపాళ్య గ్యాంగులో సభ్యుడైన దీపక్ నాయక్ ఇంటింటికి తిరిగి పాలు అమ్ముతూ ఉంటాడు. పాలమ్మే సమయంలో ఏ ఇంటి దగ్గర రెండు రోజుల న్యూస్ పేపర్లు కనిపిస్తే దేవరాజ్‌కు సమాచారం ఇచ్చేవాడు.


ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని మరో సారి ధ్రువీకరించుకున్న తర్వాత దొంగతనానికి వెళ్లే వారు. జనవరి 7వ తేదీన సిద్ధార్థనగర్, చామరాజనగర్‌లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఎంతో చాకచక్యంగా అక్కడినుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. ఈ గ్యాంగ్ ఈ రెండు ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది. భారీగా నగదు, సొమ్మును దోచుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ గ్యాంగ్ కోసం గత కొన్ని నెలల నుంచి అన్వేషిస్తున్నారు. తాజాగా, జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున ఓ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోలిపాళ్య గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ నుంచి అరకేజీ బంగారం, 8.5 కిలోల వెండిని, రెండు లక్షల విలువైన ఆభరణాలు ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు. ఓ బైకును సీజ్ చేశారు.


ఇవి కూడా చదవండి

Viral Video: బైకుపై వచ్చి.. వీధిలో నడుచుకుంటూ వెళుతున్న మహిళపై దారుణం..

Rain Forecast: మరో 3 రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Updated Date - May 26 , 2025 | 07:55 PM