ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata High Court: శర్మిష్ఠ పనోలికి మధ్యంతర బెయిల్‌ మంజూరు

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:49 AM

సోషల్‌ మీడియా ఇన్‌ప్ల్యూయెన్సర్‌, లా విద్యార్ధిని శర్మిష్ఠ పనోలికి కోల్‌కతా హైకోర్ట్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

కోల్‌కతా, జూన్‌ 5: సోషల్‌ మీడియా ఇన్‌ప్ల్యూయెన్సర్‌, లా విద్యార్ధిని శర్మిష్ఠ పనోలికి కోల్‌కతా హైకోర్ట్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదని చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల శర్మిష్ఠ పుణేలోని ఓ న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ బాలీవుడ్‌ ప్రముఖుల మౌనంపై శర్మిష్ఠ మే 14న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.


ఇది వైరల్‌ అవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పారు. అయితే ఓ వర్గం వారి మనోభావాలను కించపరిచారంటూ శర్మిష్ఠపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో కోల్‌కతా పోలీసులు ఆమెను మే 31న అరెస్ట్‌ చేశారు.

Updated Date - Jun 06 , 2025 | 04:49 AM