Kharge: ఎమర్జెన్సీపై కేంద్రం డ్రామాలు: కాంగ్రెస్
ABN, Publish Date - Jun 26 , 2025 | 06:16 AM
పాలనావైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం ఎమర్జెన్సీ ఘటనపై నాటకాలు ఆడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.
న్యూఢిల్లీ, జూన్ 25 : పాలనావైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి కేంద్రప్రభుత్వం ఎమర్జెన్సీ ఘటనపై నాటకాలు ఆడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. జాతీయోద్యమంలోను, రాజ్యాంగ రచనలోను భాగస్వాములు కానివారు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను తిరస్కరించినవారు ఎప్పుడో యాభై ఏళ్లనాడు విధించిన ఎమర్జెన్సీ ఘటనను కొత్తగా తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.
శనివారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దేశమంతా అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు విస్తరించి ఉన్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీని ‘రాజ్యాంగ హత్యాదినం’గా అభివర్ణిస్తూ బీజేపీ నాటకాలడుతోందన్నారు. మోదీ, ఆయన సర్కారు మూలంగా రాజ్యాంగం ప్రమాదంలో పడిందని విమర్శించారు.
Updated Date - Jun 26 , 2025 | 06:16 AM