Arvind Kejriwal: చూసేకి అగ్గిరవ్వ మాదిరి..
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:47 AM
ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వేడుకలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ యమాజో్‌షగా భాంగ్రా నృత్యంతో అలరించారు. కాగా, శుక్రవారం హర్షిత, సంభవ్‌ల వివాహం ఘనంగా జరిగింది.
కూతురు నిశ్చితార్థ వేడుకలో పుష్ప సినిమా పాటకు కేజ్రీవాల్ దంపతుల డ్యాన్స్
న్యూఢిల్లీ, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ పుష్ప సినిమా పాటపై హుషారుగా నృత్యం చేశారు! ఇటీవల ఢిల్లీలోని ఓ విలాసవంతమైన ఐదు నక్షత్రాల హోటల్లో కేజ్రీవాల్ దంపతుల కూతురు హర్షిత కేజ్రీవాల్ వివాహ నిశ్చితార్థం ఆమె కాలేజీ స్నేహితుడు సంభవ్ జైన్‌తో జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై ‘అంగారోంకా అంబర్ సా.. ’ (తెలుగులో.. ‘చూసేకి అగ్గిరవ్వ మాదిరి) పాట వస్తోంటే కేజ్రీవాల్ దంపతులు లయబద్ధంగా పదం పదం కలపడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు.
ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వేడుకలో పంజాబ్ సీఎం భగవంత్ మన్ యమాజో్‌షగా భాంగ్రా నృత్యంతో అలరించారు. కాగా, శుక్రవారం హర్షిత, సంభవ్‌ల వివాహం ఘనంగా జరిగింది.
ఇవి కూడా చదవండి..
Thackeray Cousins Renuion: మళ్లీ కలవడం కష్టమేమీ కాదు.. సంకేతాలిచ్చిన థాకరే సోదరులు
PM Modi: సౌదీ అరేబియాలో మోదీ రెండ్రోజుల పర్యటన
Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..
Updated Date - Apr 20 , 2025 | 04:47 AM