ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: మంత్రి అహ్మద్‌ఖాన్‌ సీరియస్.. పేదల నుంచి లంచం తీసుకునే దరిద్రం రాలేదు..

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:34 PM

పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు రాలేదంటూ.. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు.

- నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

- జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ సవాల్‌

బెంగళూరు: పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు రాలేదంటూ.. గృహ నిర్మాణశాఖ మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌(Minister Zameer Ahmed Khan) మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లబ్ధిదారులనుంచి తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానన్నారు. తన శాఖలో అవినీతికి తావు లేదన్నారు. ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌(MLA BR Patil) ఆరోపణలపై విచారణ జరుపుతామని, ఎమ్మెల్యేతోనూ మాట్లాడతానన్నారు.

బీఆర్‌ పాటిల్‌ ఎక్కడా మంత్రి లంచం తీసుకున్నారని ఆరోపించలేదన్నారు. ఏ పంచాయతీలోనైనా అటువంటి సంఘటన జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ(MLA Belur Gopalakrishna) తన రాజీనామా కోరారని, అయితే లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే తానే పదవి వదులకుంటానన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జూలై ఒకటి నుంచి రైల్వే చార్జీలు స్వల్పంగా పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 25 , 2025 | 01:34 PM