ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటక వాల్మీకి స్కాం కేసులో ఈడీ దాడులు

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:14 AM

కర్ణాటకలో మహర్షి వాల్మీకి ఎస్టీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.187కోట్ల నిధులను లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి మళ్లించారన్న ఆరోపణలపై బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, అదే జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.

  • బళ్లారి ఎంపీ తుకారాం ఇంట్లో సోదాలు

  • ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఇళ్లలోనూ

బళ్లారి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మహర్షి వాల్మీకి ఎస్టీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.187కోట్ల నిధులను లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి మళ్లించారన్న ఆరోపణలపై బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, అదే జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. సుమారు పది బృందాలు బుధవారం ఉదయం 6 గంటలకే రంగంలోకి దిగాయి.

తుకారాం, బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్‌టీ శ్రీనివాసులు నివాసాలు, బెంగళూరులోని విధానపరిషత్‌లో మాజీ మంత్రి బి.నాగేంద్రకు కేటాయించిన కార్యాలయం, బళ్లారిలో ఆయన ఆప్తుడు గోవర్ధన్‌రెడ్డి ఇల్లు, నాగేంద్ర పీఏ విజయ్‌కుమార్‌ ఇంట్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేశాయి. ఈడీ అధికారులు స్థానిక పోలీసులను కాకుండా భద్రత కోసం బీఎ్‌సఎఫ్‌ బలగాలను తెచ్చుకున్నారు. స్థానిక పోలీసులు వెళ్లినా వెనక్కి పంపించారు. తమను ఎస్పీ పంపించారని ఓ సీఐ చెప్పగా.. ‘మీ సహాయం అవసరం లేదు’ అని తిప్పి పంపించారు.

Updated Date - Jun 12 , 2025 | 05:14 AM