సైకిల్‌పై నుంచి జారిపడ్డ డీకే శివకుమార్
ABN, Publish Date - Jun 18 , 2025 | 06:06 AM
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ మీద నుంచి జారిపడ్డారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బెంగళూరులో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
బెంగళూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ మీద నుంచి జారిపడ్డారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు బెంగళూరులో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ క్రమంలో విధాన సౌధ మెట్ల వద్ద సైకిల్ ఆపి కిందకు దిగే ప్రయత్నంలో అదుపుతప్పి జారిపడ్డారు.
వెంటనే ఆయనకు భద్రతా సిబ్బంది సహాయం అందించి పైకి లేపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక ఫోటో షేర్ చేశారు. ‘‘పవర్ కారిడార్‌లో నేను సైకిల్ ఎంచుకున్నాను. అభివృద్ధికి ఎప్పుడూ హార్స్‌పవర్ అవసరం లేదు, ప్రజా బలం చాలు’’ అన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 06:06 AM