ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: ప్రాణం తీసిన పందెం.. 10,000 కోసం యువకుడు ఏం చేశాడంటే..

ABN, Publish Date - May 01 , 2025 | 02:32 PM

డబ్బు కోసం పందెం కాశాడు ఓ యువకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు క్వార్టర్ల మద్యంను ఏ మాత్రం నీళ్లు కలపకుండా తాగాడు. చివరికి ఏం జరిగిందంటే..

Karnataka Incident

Karnataka: మద్యం ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెగ్యులర్‌గా తాగితే లివర్ డామేజ్ అవ్వడంతో పాటు, హార్ట్ ఫెయిల్ అవుతుందని తెలిసినా కూడా కొంతమంది తాగేవాళ్లు ఉన్నారు. ఇక, స్పీడుగా మద్యం తాగితే ఉన్నపళంగా ప్రాణాలే పోతాయి. అయితే, ఈ విషయం తెలియక కర్నాటకలోని కోలార్ జిల్లా పూజారహళి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ప్రాణం కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే..


కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు నీళ్లు కలపకుండా 5 క్వార్టర్ల మద్యం బాటిల్లు తాగుతానంటూ తన స్నేహితులతో పందెం వేశాడు. ఓడిపోతే తాను రూ. 10 వేలు ఇస్తానని వెంకట రెడ్డి అనే వ్యక్తితో సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. పందెం కుదరడంతో కార్తీక్ తన దగ్గర ఉన్న డబ్బుతో ఐదు బాటిళ్ల మద్యాన్ని తెచ్చుకున్నాడు. ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా ఏకంగా 5 బాటిళ్ల మద్యాన్ని గడగడా తాగేశాడు. ఆ ఆల్కహాల్ అతని శరీరంలోకి చేరడంతో కార్తీక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే అతడిని కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ కార్తీక్ చికిత్స పొందుతూ తన ప్రాణాలు కోల్పోయాడు.


కాగా, కార్తీక్‌కు వివాహం జరిగి ఒక సంవత్సరం అయింది. అతని భార్య ఎనిమిది రోజుల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంకట రెడ్డి సహా ఆరుగురు వ్యక్తులపై నంగలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మిగిత నిందితుల కోసం వెతుకుతున్నారు.


Also Read:

Vastu Tips: ఇలా కట్టిన ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు ఉంటాయి..

Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..

Home Minister Anitha: అమరావతిని నాశనం చేశారు.. జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్

Updated Date - May 01 , 2025 | 03:46 PM