ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamal Hasan: దేశ సంక్షేమం కోసమే డీఎంకేతో పొత్తు

ABN, Publish Date - May 31 , 2025 | 12:06 PM

నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ సంక్షేమం కోసమే డీఎంకే కూటమిలో చేరామని ఆయన అన్నారు. అలాగే.. జూన్‌ 19న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓ సీటిచ్చినందుకుగాను ఆయన సీఎం స్టాలిన్‌, డీఎంకే నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

- ఎంఎన్‌ఎం నేత కమల్‌హాసన్‌

చెన్నై: దేశ సంక్షేమం కోసమే డీఎంకే కూటమిలో చేరామని మక్కల్‌ నీదిమయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌(Kamal Hasan) పేర్కొన్నారు. డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జూన్‌ 19న జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓ సీటిచ్చినందుకుగాను ఆయన స్టాలిన్‌, డీఎంకే నేతలకు ధన్యవాదాలు తెలిపారు.


గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుదిరిన పొత్తుల ప్రకారం లభించిన రాజ్యసభ స్థానానికి కమల్‌ పోటీ చేయనున్న విషయం విధితమే. ఈ భేటీ అనంతరం కమల్‌హాసన్‌ అన్నా అరివాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మక్కల్‌ నీది మయ్యంకు రాజ్యసభ స్థానం కేటాయించినందుకుగాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు.


ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల గురించి స్టాలిన్‌ తనకు సమగ్రంగా వివరించారని తెలిపారు. దేశ సంక్షేమానికి అవసరం కనుకనే డీఎంకే కూటమిలో చేరినట్లు ఆయన చెప్పారు. ఇకపై రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడి పరిష్కరించేందుకు దోహదపడతానని చెప్పారు. రాష్ట్ర సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని కమల్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 12:06 PM