Jaya Bachchan: సెల్ఫీ ముచ్చట..మరోసారి సహనం కోల్పోయిన జయాబచ్చన్
ABN, Publish Date - Aug 12 , 2025 | 05:43 PM
బిహార్‌లో ఎన్నికల జాబితాలో మోసాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసేందుకు విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సమయంలో జయాబచ్చన్ అక్కడకు చేరుకున్నారు.
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) మరోసారి సహనం కోల్పోయారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్‌గా నిలదీస్తూనే ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో సోమవారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన 32 సెకన్ల వీడియా ఇప్పుడు వైరల్ అవుతోంది.
బిహార్‌లో ఎన్నికల జాబితాలో మోసాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసేందుకు విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సమయంలో జయాబచ్చన్ అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏం చేస్తున్నావు నువ్వు' అని ప్రశ్నిస్తూ అతన్ని పక్కకు నెట్టేశారు. ఆ తర్వాత లోక్‌సభ ఎంపీ, ఆర్జేడీ నేత మిసా భారతితో కలిసి ఆమె ముందుకు కదిలారు.
ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చ జరిగిన సమయంలోనూ జయాబచ్చన్ సహనం కోల్పోయారు. అధికార పక్ష సభ్యులు తన ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఆమెను శాంతపరిచేందుకు పక్కనే ఉన్న ప్రియాంక చతుర్వేది ప్రయత్నించగా.. నన్ను ఆపొద్దు ప్రియాంకా.. అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
పౌరసత్వానికి ఆధార్‌ను పరిగణనలో తీసుకోలేం.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
జస్టిస్ వర్మ నోట్ల కట్టల ఉదంతం కీలక మలుపు.. అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోక్‌సభ స్పీకర్
For More National News and Telugu News
Updated Date - Aug 12 , 2025 | 06:07 PM