Air India Flight: ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక లోపం
ABN, Publish Date - Jun 23 , 2025 | 05:33 PM
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాంకేతిక లోపం కారణంలో ఢిల్లీ విమానం వెనక్కి రావడంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (Air India) విమానాలకు సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ టూ జమ్మూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు సోమవారంనాడు ఈ పరిస్థితి తలెత్తింది. ఐఎక్స్2564 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిత లోపం గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ విమానం వెనక్కి రావడంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
దీనికిముందు, ఆదివారంనాడు తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేశారు. తిరువనంతపురంలో విమానం ల్యాండింగ్ కాగానే తనిఖీలు చేపట్టగా పక్షి ఢీకొట్టినట్టు గుర్తించారు. దీంతో ఢిల్లీకి షెడ్యూల్డ్ ప్రయాణాన్ని రద్దు చేశారు. కాగా, మూడు రూట్లులో ఎయిర్ ఇండియా సర్వీసులను రద్దు చేయడంతో పాటు 118 వీక్లీ ఫ్లైట్లను 19 రూట్లలో తాత్కాలికంగా తగ్గించినట్టు ఎయిర్ ఇండియా ఆదివారంనాడు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
నా ప్రాణాలకు ముప్పు ఉంది.. తేజ్ ప్రతాప్ యాదవ్
గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు
For National News And Telugu News
Updated Date - Jun 23 , 2025 | 05:35 PM