ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mohammad Sinwar: హమాస్‌ గాజా చీఫ్‌ హతం

ABN, Publish Date - May 29 , 2025 | 05:53 AM

హమాస్‌ గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్‌ మృతి చెందాడని కథనాలు వెలువడ్డాయి.

  • మహ్మద్‌ సిన్వర్‌ను మా ఆర్మీ మట్టుబెట్టింది: ఇజ్రాయెల్‌

టెల్‌ అవీవ్‌, మే 28: హమాస్‌ గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్‌ బలగాలు గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో సిన్వర్‌ మృతి చెందాడని కథనాలు వెలువడ్డాయి. ఖాన్‌ యూని్‌సలోని యూరోపియన్‌ ఆస్పత్రి కింది భాగంలో కమాండ్‌ సెంటర్‌లో ఉండగా సిన్వర్‌ను డ్రోన్‌ దాడితో హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ బలగాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశాయి. ఆస్పత్రి కింది భాగంలో సొరంగం ఉన్నట్లు వీడియోలో చూపారు. గతంలో ఇస్మాయిల్‌ హన్యా, మహ్మద్‌ డెయిఫ్‌, యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లే తాజాగా మహ్మద్‌ సిన్వర్‌ను మట్టుబెట్టినట్లు నెతన్యాహు పార్లమెంట్‌లో ప్రకటించారు. 2023 దాడులకు సూత్రధారిగా భావించిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్‌ గత ఏడాది హతమార్చింది. ఇప్పుడు ఆయన సోదరుడు మహ్మద్‌ సిన్వర్‌ కూడా మృతి చెందడంతో హమా్‌సకు గాజాలో వెన్ను విరిగినట్లైంది.


యెమన్‌లోని సనా విమానాశ్రయంపై ఇజ్రాయెల్‌ దాడి

యెమన్‌లోని సనా విమానాశ్రయంపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ బుధవారం వెల్లడించారు. యెమన్‌కు చెందిన హౌతీలు మంగళవారం తమ దేశంపైకి రెండు క్షిపణులను ప్రయోగించడంతో తాము ప్రతిస్పందించామని చెప్పారు. అక్కడ మిగిలి ఉన్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశామన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:58 PM