IRCTC New service: జనరల్ క్లాస్ ప్రయాణీకులకు శుభవార్త..
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:44 PM
జనరల్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై ప్రయాణంలో ఆహారం, నీళ్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఐఆర్‌సిటిసి (IRCTC) కొత్త సర్వీస్ ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకు జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి ఆహారం విషయమై చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు. భారతీయ రైల్వేలు (IRCTC) కొత్తగా ఏర్పాటు చేసిన సర్వీస్‌తో జనరల్ కోచ్ ప్రయాణికులకు మంచి నాణ్యత గల ఆహారం, తాగునీరు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త పథకం ద్వారా జనరల్ క్లాస్‌లో ప్రయాణించే వారు సీటు వదిలి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా భోజనం నేరుగా వారి సీటు దగ్గరే అందిస్తారు.
రూ.80కే భోజనం..
ఈ ఆహారం అదే రైల్లోని ఏసీ కోచ్ ప్రయాణికులకు ఇచ్చే భోజనంతో సమానంగా ఉంటుంది. కేవలం రూ.80కే మంచి నాణ్యత గల ఆహారం అందుబాటులో ఉంటుంది. అన్నం, పప్పు, ఒక కర్రీ, రొట్టె, ఊరగాయ.. ఇవన్నీ నాణ్యమైన ఫుడ్ బాక్స్‌లో ప్యాక్ చేసి అందిస్తారు. అంతేకాకుండా.. ఒక చెంచా, నాప్‌కిన్ వంటివీ ఈ ప్యాకింగ్‌లో ఉంటాయి.
ఈ రైళ్లలో కొత్త సర్వీస్ ప్రారంభం
గోమతి ఎక్స్‌ప్రెస్
శ్రీనగర్ గంగానగర్- న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ
కైఫియత్ ఎక్స్‌ప్రెస్
అయోధ్య ఎక్స్‌ప్రెస్
బరౌని–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్
దర్భంగా–న్యూఢిల్లీ క్లోన్ ఎక్స్‌ప్రెస్
ఇంకా మరిన్ని రైళ్లలో త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఈ స్టేషన్లలో సీటింగ్ సౌకర్యం
న్యూఢిల్లీ స్టేషన్‌లో జనరల్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. వారు కోచ్‌లో నిలబడి తినాల్సిన అవసరం లేకుండా కూర్చొని తినొచ్చు. మరికొన్ని ప్రధాన స్టేషన్లు.. వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోల్లో కూడా ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు సౌకర్యం కలిగించే ఈ కొత్త విధానం వల్ల ఐఆర్‌సీటీసీపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రయాణికులు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బందీ పడకుండా హ్యాపీగా జనరల్ క్లాస్‌లో ప్రయాణించవచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో సంచలనం.. ఈ చిన్న దేశం ప్రపంచంలోనే టాప్ సేఫ్ కంట్రీ..!
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు
For More National News
Updated Date - Jul 23 , 2025 | 09:22 PM