Share News

Numbio Safety Index 2025: గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో సంచలనం.. ఈ చిన్న దేశం ప్రపంచంలోనే టాప్ సేఫ్ కంట్రీ..!

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:39 PM

ఈ చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనది. భద్రత విషయంలో అమెరికా, యుకెలను సైతం అధిగమించింది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం, ప్రపంచంలోని టాప్ 10 భద్రతా దేశాలు ఏవో తెలుసుకుందాం..

Numbio Safety Index 2025: గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో సంచలనం.. ఈ చిన్న దేశం ప్రపంచంలోనే టాప్ సేఫ్ కంట్రీ..!
Andorra

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా 2025 నాటికి అండోరా నిలిచింది. ఇది మంచుతో కప్పబడి పర్వతాలతో చుట్టుముట్టిన చిన్న యూరోపియన్ దేశం. ఈ దేశం భద్రత విషయంలో అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి సూపర్ పవర్స్‌ను కూడా వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 147 దేశాల భద్రతా పరిస్థితుల ఆధారంగా ర్యాంకింగ్‌లు ఇచ్చారు.


సేఫ్టీ ఇండెక్స్ (Safety Index) అంటే ఒక దేశంలో లేదా నగరంలో ప్రజల భద్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సూచిక (index). ఇది నేరాల రేటు, ప్రజల అభిప్రాయాలు, పోలీసుల పని తీరుతో ముడిపడి ఉంటుంది. ఈ ఇండెక్స్‌ను చాలా వరకు నంబియో (Numbeo) అనే గ్లోబల్ డేటాబేస్ సంస్థ రూపొందిస్తుంది. ఇది ప్రజల అభిప్రాయాలు, నివేదించిన అనుభవాలు, నేరాల రేట్లు వంటి అంశాల ఆధారంగా భద్రతా స్థితిని అంచనా వేస్తుంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం, ఈ దేశాల్లో ప్రజలు తమను చాలా సురక్షితంగా భావిస్తున్నారు.


టాప్ 10 సురక్షిత దేశాలు ఇవే:

  • అండోరా - 84.7

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 84.5

  • ఖతార్ – 84.2

  • తైవాన్ – 82.9

  • ఒమన్ – 81.7

  • ఐల్ ఆఫ్ మ్యాన్ – 79.0

  • హాంకాంగ్ – 78.5

  • అర్మేనియా – 77.9

  • సింగపూర్ – 77.4

  • జపాన్ – 77.1


పాకిస్తాన్ భారతదేశం కంటే ముందు!

అమెరికా (89వ స్థానం, స్కోర్: 50.8), యునైటెడ్ కింగ్‌డమ్ (87వ స్థానం, స్కోర్: 51.7) కంటే మెరుగైన స్థానంలో భారత్ 66వ స్థానం (స్కోర్: 55.7) కలిగి ఉంది. అంటే, భద్రత పరంగా భారత్ ప్రస్తుతం అమెరికా, యుకె కంటే ముందు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ (65వ స్థానం, స్కోర్: 56.3)తో భారత్ కంటే ఒక మెట్టు ముందు ఉంది.


దక్షిణాసియా దేశాల భద్రతా స్థితి:

  • చైనా – 15వ స్థానం (స్కోర్: 76.0)

  • శ్రీలంక – 59వ స్థానం (స్కోర్: 57.9)

  • భారత్ – 66వ స్థానం (స్కోర్: 55.7)

  • పాకిస్తాన్ – 65వ స్థానం (స్కోర్: 56.3)

  • బంగ్లాదేశ్ – 126వ స్థానం (స్కోర్: 38.4)

  • ఆఫ్ఘనిస్తాన్ – 144వ స్థానం (స్కోర్: 24.9)


అత్యంత అసురక్షిత దేశాలు:

  • వెనిజులా – స్కోర్: 19.3

  • పాపువా న్యూ గినియా – 19.7

  • హైతీ – 21.1

  • ఆఫ్ఘనిస్తాన్ – 24.9

  • దక్షిణాఫ్రికా – 25.3

  • హోండురాస్ – 28.0

  • ట్రినిడాడ్ & టొబాగో – 29.1

  • సిరియా – 31.9

  • జమైకా – 32.6

  • పెరూ – 32.9


భద్రత విషయంలో పెద్ద దేశాలకన్నా చిన్న దేశాలు ముందున్నాయి. అండోరా లాంటి దేశం ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా గుర్తింపు పొందడం విశేషం. భారత్ కూడా బాగా ప్రగతిలో ఉంది, కానీ చైనా, పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాల కంటే మాత్రం ఇంకా మెరుగుదల అవసరం ఉంది.


ఇవి కూడా చదవండి..

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన

భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:45 PM