ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPS Officers Husband: 24 కోట్ల మోసం.. ఐపీఎస్ అధికారి భర్త అరెస్ట్

ABN, Publish Date - May 20 , 2025 | 09:58 PM

IPS Officers Husband: ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు పురుషోత్తమ్ భార్య రష్మి కరందికర్‌ను కూడా విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి.

IPS Officers Husband

ఆర్థిక మోసం కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి రష్మీ కరందికర్ భర్త పురుషోత్తమ్ చవాన్ అరెస్ట్ అయ్యారు. 24.78 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి సంబంధించి ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పురుషోత్తమ్ మార్చి 2015 నుంచి 2024 ఏప్రిల్ వరకు దాదాపు 20 మందిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ 20 మందికి ముంబై, థానే, పుణెలలో ప్రభుత్వ కోటాకు సంబంధించిన స్థలాలను తక్కువ రేటుకే ఇప్పిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.


పురుషోత్తమ్ మాటలు నమ్మి వారు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు. భార్య ఐపీఎస్ అధికారి కావటం.. ప్రభుత్వంలో ఉన్న పెద్ద వారితో పురుషోత్తమ్‌కు సంబంధాలు ఉండటంతో ఆ 20 మంది వెంటనే అతడి మాటలు నమ్మేశారు. పురుషోత్తమ్‌తొ పాటు మరో 11 మందిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసుకు సంబంధించి.. అతడిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పురుషోత్తమ్ సూరత్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌ను కూడా మోసం చేశాడు. అతడి దగ్గరినుంచి ఏకంగా 7.42 కోట్లు దోచేశాడు.


ది ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW) అధికారులు పురుషోత్తమ్ భార్య రష్మి కరందికర్‌ను కూడా విచారిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలోకి మూడు కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ మూడు కోట్లు భర్త నుంచి ఆమె ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు ఆమె మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు. కేసులు కూడా నమోదు కాలేదు. భర్త కారణంగా ఆమె విచారణ కోసం హాజరు కావాల్సి వస్తోంది. పురుషోత్తమ్ భార్య ఐపీఎస్ కావటంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి

Real Life Robinhood: ఈ దొంగ గురించి తెలిస్తే మీరు కూడా శభాష్ అంటారు..

Rajnath Singh: పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్ నడ్డివిరిచాం

Updated Date - May 20 , 2025 | 09:58 PM