Real Life Robinhood: ఈ దొంగ గురించి తెలిస్తే మీరు కూడా శభాష్ అంటారు..
ABN , Publish Date - May 20 , 2025 | 09:11 PM
Real Life Robinhood: బెగూర్‌కు చెందిన శివు అలియాస్ శివరప్పన్ డిప్రెషన్ కారణంగా ఓ సారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. జీవితం మీద విరక్తితోటే బతుకుతున్నాడు.

చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమాలో హీరో చిరంజీవి మోసగాళ్లను దోచి పేదలకు పంచుతూ ఉంటాడు. కిక్ సినిమాలోనూ హీరో దొంగిలించిన డబ్బులను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి పంచుతాడు. దీన్నే రాబిన్ హుడ్ స్టైల్ అంటారు. రాబిన్ హుడ్ స్పూర్తితో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, నిజ జీవితంలో మాత్రం రాబిన్ హుడ్ లాంటి పాత్రలు అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాడే బెంగళూరుకు చెందిన శివు అలియాస్ శివరప్పన్. ఇతడు దొంగతనాలు చేసిన డబ్బులతో పేద పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు కట్టాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బెగూర్‌కు చెందిన శివు అలియాస్ శివరప్పన్ డిప్రెషన్ కారణంగా ఓ సారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. జీవితం మీద విరక్తితోటే బతుకుతున్నాడు. పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి స్నేహితులు ఇబ్బందిపడ్డం చూసి అతడు చలించిపోయాడు. ఈ నేపథ్యంలోనే దొంగతనాలు మొదలెట్టాడు. బెంగళూరులోని పలు ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగతనాలు చేశాడు. దోచిన బంగారాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి అమ్మాడు. 22 లక్షలు వచ్చాయి.
ఆ మొత్తంలో అతడి మిత్రులైన వివేక్, అనిల్‌లకు చెరో నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన 14 లక్షల్ని తమ ఏరియాలోని పేద పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడానికి వాడాడు. అలా 20 మంది పేద విద్యార్థులకు సాయం చేశాడు. పోలీసులు తాజాగా, శివుతో పాటు అతడి మిత్రులను కూడా అరెస్ట్ చేశారు. శివు ఆ డబ్బుల్ని ఏం చేశాడో తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆ ముగ్గురి దగ్గరినుంచి 24 లక్షలు విలువ చేసే బంగారం బార్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో శివు స్టోరీ వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
Indian Air Force: గూస్‌బమ్స్ వీడియో విడుదల చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
Hyderabad: మాయ లేడీలు.. పెళ్లి చేస్తానంటే నమ్మాడు.. పెళ్లి రోజు ఊహించని షాక్..