DGMO Meeting: నేడు హాట్‌లైన్‌లో భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు..
ABN, Publish Date - May 12 , 2025 | 04:25 AM
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో డీజీఎంవోలు సోమవారం చర్చలు జరగనున్నారు. ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాక్ సైన్యం కాల్పులు జరిపి విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ప్రస్తావనకు రానున్న కాల్పుల విరమణ కొనసాగింపు, ఇతర కీలకాంశాలు
న్యూఢిల్లీ, మే 11: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల వంటి కీలకాంశాలపై చర్చించనున్నారు. అయితే శనివారం మధ్యాహ్నమే ముందుగా భారత్ డీజీఎంవోతో పాక్ డీజీఎంవో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదిస్తూ తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోపే డ్రోన్ దాడులు, కాల్పులకు తెగబడి పాక్ సైన్యం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. కాగా, భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారికి సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
Updated Date - May 12 , 2025 | 04:25 AM