Indian Navy: నావికాదళం యుద్ధానికి సిద్ధం
ABN, Publish Date - May 04 , 2025 | 05:19 AM
పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత నావికాదళం అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. వీటితో ఆయుధ సామర్థ్యం, వ్యూహాలు, దాడి సమయంలో చర్యలపై దృష్టి పెడుతున్నారు.
అరేబియా సముద్రంలో లైవ్ ఫైరింగ్ డ్రిల్
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో... యుద్ధ సన్నద్ధతను పరిశీలించేందుకు భారత నావికాదళం అరేబియా సముద్రంలో విన్యాసాలు చేపట్టింది. సాధారణ డ్రిల్ తరహాలో కాకుండా.. యుద్ధంలో ఉన్నట్టుగానే లక్ష్యాలపై అసలైన ఆయుధాలను ప్రయోగించి, ప్రత్యక్షంగా (లైవ్ ఫైరింగ్ డ్రిల్) పరిశీలించనుంది. ఆయుధాల సామర్థ్యం, కచ్చితత్వాన్ని పరీక్షించడంతోపాటు దాడి సమయంలో వ్యవహరించాల్సిన తీరు, వ్యూహాల రూపకల్పనకు ఈ డ్రిల్ తోడ్పడుతుందని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. శనివారమే ప్రారంభమైన ఈ లైవ్ డ్రిల్ బుధవారం (7వ తేదీ) వరకు కొనసాగనుంది. అరేబియా సముద్రంలో నేవీ విన్యాసాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకలకు నావిగేషన్ హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు.. నావికాదళం ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి శనివారం నేవీ లైవ్ డ్రిల్ ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో నావికాదళం సన్నద్ధత, అరేబియా సముద్రంలో లైవ్ డ్రిల్‌కు సంబంధించిన అంశాలను ప్రధానికి వివరించినట్టు తెలిసింది.
నౌకాదళం త్రిశూల వ్యూహం
సముద్రం ఉపరితలం(యుద్ధనౌక), సముద్రం లోపల(జలాంతర్గామి), సముద్ర జలాల పై నుంచి(హెలికాప్టర్) మూడు రకాలుగా దాడులకు సిద్ధమంటూ భారత నౌకాదళం శనివారం విడుదల చేసిన ఫొటో
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Updated Date - May 04 , 2025 | 05:19 AM