Crime News: సింగపూర్ వెళ్తున్న విమానంలో భారతీయుడి అరెస్ట్.. ఎందుకంటే..
ABN, Publish Date - Apr 24 , 2025 | 04:50 PM
ఆస్ట్రేలియా నుండి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో 20 ఏళ్ల భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని లైంగికంగా వేధించాడని అతడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సింగపూర్: సింగపూర్-బౌండ్ విమానంలో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. విమానంలో 28 ఏళ్ల మహిళా క్యాబిన్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అధికారులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సిబ్బంది ఒక మహిళా ప్రయాణీకురాలిని టాయిలెట్‌కు తీసుకెళ్తుండగా, నేలపై టిష్యూ పేపర్‌ను గమనించింది. ఆమె దానిని తీసుకోవడానికి వంగినప్పుడు, 20 ఏళ్ల వ్యక్తి ఆమె వెనుక నుండి వచ్చి, ఆమెను పట్టుకుని, తనతో పాటు టాయిలెట్‌లోకి బలవంతంగా నెట్టాడు. ఈ సంఘటనను చూసిన మహిళా ప్రయాణీకురాలు జోక్యం చేసుకుని, సిబ్బందిని వెంటనే టాయిలెట్ నుండి బయటకు తీసుకురావడానికి సహాయం చేసింది.
మూడు సంవత్సరాల జైలు శిక్ష
అనంతరం, ఈ విషయాన్ని క్యాబిన్ సూపర్‌వైజర్‌కు నివేదించారు. విమానం చాంగి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయ పోలీసు విభాగం అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, సింగపూర్ చట్టం ప్రకారం, ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. విమానాశ్రయ పోలీసు విభాగం కమాండర్, అసిస్టెంట్ కమిషనర్ ఎం మాలతి మాట్లాడుతూ.. సిబ్బందిని, విమానంలోని ప్రయాణీకులను ఏ విధమైన లైంగిక వేధింపులు లేదా దాడి చేసినా కఠినమైన శిక్ష తప్పదని హెచ్చరించింది.
Also Read:
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Updated Date - Apr 24 , 2025 | 04:50 PM