Pawandeep Rajan Road Accident: భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు
ABN, Publish Date - May 05 , 2025 | 05:16 PM
ఇండియన్ ఐడల్ సీజన్ 12 విన్నర్ పవన్‌దీప్ రాజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున ఆయన కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ 2 విజేత పవన్ దీప్ రాజన్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజన్‌కు వైద్యులు చికిత్స చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయాలతో ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్న దృశ్యాలు చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు ప్రకటించాల్సి ఉంది (Pawandeep Rajan Road Accident).
ఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తాజా ఆరోగ్య స్థితిపై కూడా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం తన పుట్టిన రోజు జరుపుకున్న రాజన్‌కు అభిమానులు వివిధ వేదికల ద్వారా పెద్ద ఎత్తున శుభాంకాంక్షలు తెలిపారు. ఇంతలోనే యాక్సిడెంట్ విషయం వెలుగులోకి రావడంతో అభిమానులు, సంగీత ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ ఐడల్‌లో గెలిచాక పవన్‌దీప్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. రాత్రికి రాత్రి అతడో సంచలనంగా మారిపోయాడు. గుండెలకు హత్తుకునేలా ఉండే పవన్‌దీప్ గాత్రం అతడికి లక్షల మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఇక సీజన్ ఫినాలేలో ఆయన ఐదుగురు ఫైనలిస్టులను వెనక్కు నెట్టి విన్నర్‌గా నిలిచారు. ఒక కారు, రూ.25 లక్షల నగదును బహుమతులుగా అందుకున్నారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్ కుటుంబానికి సంగీత నేపథ్యం ఉంది. ఆయన తల్లి సరోజ్ రాజన్, తండ్రి సురేశ్ రాజన్, సోదరి జ్యోతిదీప్ రాజన్.. కుమోనీ జానపద కళాకారులు. దీంతో, చిన్నతనంలోనే పవన్‌దీప్ సంగీత ప్రతిభ జనాలను ఆకర్షించింది. రెండేళ్ల వయసులోనే ఆయన తబలా వాయిద్యంలో ప్రావిణ్యం సంపాదించారు. అత్యంత పిన్నవయస్కుడైన తబలా ప్లేయర్‌గా అవార్డు పొందారు. ఇండియన్ ఐడల్‌కు ముందే ఆయన తన గాత్రంతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2015లో వాయిస్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ షాన్ బృందంలో సభ్యుడిగా పాల్గొని విజేతగా నిలిచారు. రూ.50 లక్షల నగదు, ఓ కారును బహుమతులుగా అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ
పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..
గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 05:25 PM