Share News

Seema Haider’s Home Intrusion: పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..

ABN , Publish Date - May 04 , 2025 | 08:32 AM

పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Seema Haider’s Home Intrusion: పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..
Seema Haider’s Home Intrusion

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఉంటున్న పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడిని స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అతడిని గుజరాత్‌కు చెందిన తేజస్‌గా గుర్తించారు. తేజస్‌కు మానసిక సమతౌల్యం లేనట్టు కనిపించిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేజస్‌ది గుజరాత్‌లోని సురేందర్ నగర్. అతడు నిన్న రాత్రి 7 గంటల సమయంలో సీమా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. తొలుత అతడు గుజరాత్ నుంచి రైల్లో ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సు ద్వారా సీమా హైదర్ ఉంటున్న గ్రామానికి చేరుకున్నాడు. నిందితుడి మొబైల్ ఫోన్లో సీమా ఫొటోలు కూడా ఉన్నాయని స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. తేజస్‌ను అరెస్టు చేశామని చెప్పారు. విచారణ సమయంలో అతడు సీమా హైదర్‌ తనపై క్షుద్ర శక్తులు ప్రయోగించిందని చెప్పాడని వారు తెలిపారు. విచారణ కొనసాగుతోందని అన్నారు.


పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన హైదర్ భారత్‌కు చెందిన సచిన్ మీనాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అప్పటికే అతడికి వివాహం కూడా జరిగింది. అయితే, మీనా కోసం ఆమె 2023లో తన ముగ్గురు పిల్లలను తీసుకుని నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఆ తరువాత సచిన్‌ను పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలిపింది. ప్రస్తుతం వారికి ఓ పాప కూడా ఉంది. కాగా, అప్పట్లో ఈ ఉదంతం సంచలనంగా మారింది. సీమా మీద పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.


కాగా, ఇటీవల ఆమె తరపు లాయర్ మీడియాతో మాట్లాడుతూ సీమా ప్రస్తుతం సనాతర ధర్మాన్ని స్వీకరించిందని తెలిపారు. ఆమెకు పాక్‌తో ఎటువంటి సంబంధాలు లేవని అన్నారు. ఇక పహల్గాం దాడి తరువాత పాకిస్థానీల వీసాలన్నీ భారత్ రద్దు చేసిన నేపథ్యంలో తనపై దయచూపాలంటూ సీమా హైదర్ భారత ప్రభుత్వానికి నెట్టింట విజ్ఞప్తి చేసింది. తనకు పాక్‌కు వెళ్లడం ఇష్టం లేదని, తనను భారత్‌లో ఉండేందుకు అనుమతించాలంటూ ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. తాను పాక్ బిడ్డను అయినా శరణార్థిగా భారత్‌కు వచ్చానని, ఓ భారతీయ కుటుంబానికి కోడలు అయ్యానని ఆమె తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 09:08 AM