ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Unemployment Data Update: ఇక ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాల విడుదల

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:58 AM

కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాలను విడుదల చేయనుంది. మే 15 నుంచి జనవరి-మార్చి గణాంకాలతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది

ముంబై, ఏప్రిల్‌ 21: కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాలను వెల్లడించనుంది. వచ్చే మే 15 నుంచి నెలవారీ ప్రాతిపదికన ఈ గణాంకాలను విడుదల చేయనున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఇంతకు ముందు మూడు నెలలకు ఒకసారి నిరుద్యోగ గణాంకాలను విడుదల చేసేవారు. మే 15న విడుదల చేసే గణాంకాల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రతి నెలా గణాంకాలను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి పట్టణ నిరుద్యోగ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. గ్రామీణ, పట్టణ నిరుద్యోగానికి సంబంధించిన డేటాను వార్షికంగా వెలువరిస్తోంది.

Updated Date - Apr 22 , 2025 | 02:58 AM