Igla-S Missiles: అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ
ABN, Publish Date - May 04 , 2025 | 01:04 PM
పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతల రక్షణ కోసం భారత ఆర్మీ అత్యవసర ప్రాతిపదికన రష్యా నుంచి స్వల్ప శ్రేణి తరగతికి చెందిన ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను దిగుమతి చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌తో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తాజా రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులను దిగుమతి చేసుకుంది. అత్యవసర సందర్భాల్లో ఆయుధ సేకరణగా ఆర్మీ ఈ స్వల్పశ్రేణి క్షిపణులను దిగుమతి చేసుకుంది. వీటితో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠం కానుంది. ఆర్మీకి చెందిన గగనతల రక్షణ వ్యూహాలకు ఈ క్షిపణులు కీలకమని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
కొన్ని వారాల క్రితం వీటిని దిగుమతి చేసుకున్న ఈ క్షిపణులను ఇప్పటికే సరిహద్దు వద్దకు తరలిస్తున్నారు. మొత్తం రూ.260 కోట్ల విలువైన క్షిపణులను ఆర్మీ దిగుమతి చేసుకుంది. వీటిని పశ్చిమ సెక్టర్‌లో మోహరిస్తున్నారు. ఫైటర్ విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్ల నుంచి ఈ క్షిపణులు రక్షణ కల్పిస్తాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.
భారత్ వద్ద ఇప్పటికే ఉన్న ఇగ్లా క్షిపణుల అత్యాధిక వర్షెన్ ఇగ్లా-ఎస్. తాజా వర్షన్ మిసైళ్లను దిగుమతి చేసుకోవడంతో పాటు మునుపటి మిసైళ్లను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తాజాపరిచింది.
ప్రస్తుతం భారత్‌కు గగనతల రక్షణ కోసం ఇలాంటి మిసైళ్ల అవసరం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు. డోన్లను గుర్తించి, నాశనం చేయగలిగే ఆయుధాల అవసరం కూడా ఉందని తెలిపాయి. పాక్ ఆర్మీకి చెందిన యూఏవీలతో పశ్చిమ సెక్టర్‌లో ముప్పు ఉన్న నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థల అవసరం పెరిగిందని వెల్లడించాయి. శత్రుదేశ డ్రోన్లు, యూఏవీలను నిర్వీర్యం చేసేందుకు భారత్ ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇండర్‌డిక్షన్ వ్యవస్థను వినియోగిస్తోంది. ఈ వ్యవస్థలో 8 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడం, పని చేయకుండా చేయడం, పక్కదారి పట్టించడం లేదా నేరుగా దాడితో నిర్వీర్యం చేయొచ్చు. శత్రుదేశ డ్రోన్లపై నేరుగా లేజర్ కిరణాలు ప్రసరింపచేసి ధ్వంసం చేసే వ్యవస్థ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
భారీ డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, విమానాలను నేరుగా నిర్వీర్యం చేయగలిగే ఆయుధాలను కూడా డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. శత్రు డ్రోన్లను గుర్తించేందుకు సులువుగా ఎక్కడికైనా తరలించగలిగే స్వల్ప శ్రేణి రాడార్ వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్మీ ప్రయత్నిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..
గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా
For National News And Telugu News
Updated Date - May 04 , 2025 | 01:52 PM