ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం పిలుపు

ABN, Publish Date - Apr 24 , 2025 | 08:46 AM

Pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా న్యూఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యవేత్తను పిలిపించింది. అతడి సమన్లు అందించింది. దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు వారికి గడువు సైతం విధించింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో దౌత్యపరంగా మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులోభాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌కు బుధవారం అర్థరాత్రి సమన్లు జారీ చేసింది. భారత్ విడిచి వెళ్లాలని ఆయనకు అందించిన సమన్లలో స్పష్టం చేసింది. అందుకోసం వారికి వారం రోజులు గడువు విధించింది. దీంతో పాక్‌‌కు చెందిన త్రివిధ దళాల్లో పని చేసే వారంతా కూడా దేశం విడిచి వెళ్లవలసి ఉంటుందని అందులో పేర్కొంది. అలాగే ఇస్లామాబాద్‌లోని భారత్ దౌత్యవేత్తతోపాటు ఆ కార్యాలయంలోని భారతీయ సిబ్బంది సైతం పాకిస్థాన్‌‌ను వీడి స్వదేశానికి రానున్నారు. పాక్‌తో దౌత్య పరంగా అన్ని సంబంధాలను భారత్ తెంచుకొంటున్న సంగతి తెలిసిందే.

పహల్గాంలో ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మరణించారు. వారిలో ఒకరు నేపాలీ దేశస్థుడు ఉన్నారు. ఈ దాడిని మోదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందులోభాగంగా ఆ దేశంతో చేసుకున్న సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే అట్టారి సరిహద్దును మూసి వేయాలని నిర్ణయించింది. ఇక పాకిస్థాన్ మిలటరీ దౌత్యవేత్తలకు పర్సన్ నాన్ గ్రేటా అంటే.. అయిష్టమైన వ్యక్తులని స్పష్టం చేసింది.


ఏప్రిల్ 22వ తేదీన అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఈ ఘటనపై సమాచారం అందడడంతో.. ఆయన తన పర్యటనను అర్థాంతరంగా ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం బుధవారం భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటి న్యూఢిల్లీలో సమాావేశమైంది. అందులోభాగంగా పాకిస్థాన్ లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ బయలుదేరి వెళ్లారు. ఆ రాష్ట్ర ఎల్ జీతోపాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో ఆయన సమావేశమైయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను వారితో ఆయన సమీక్షించారు.

ఇక మృతదేహాలకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాధిత కుటుంబాల వారిని ఆయన పరామర్శించి.. ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఢిల్లీకి వచ్చిన హో మంత్రి అమిత్ షా.. జమ్మూ కశ్మీర్‌లోని పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించారు. దీంతో పాకిస్థాన్‌పై భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Pahalgam Terror Attack: పాక్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

For National news And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 09:46 AM