ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Remittance Fee: భారత్‌కు పంపే సొమ్ముపై రెమిటెన్స్‌ పన్ను లేనట్టే

ABN, Publish Date - Jun 29 , 2025 | 05:09 AM

అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట లభించింది. అక్కడ సంపాదించి స్వదేశాలకు పంపే సొమ్ము (రెమిటెన్స్‌ల)పై ప్రతిపాదించిన పన్నును.. అమెరికా చట్టసభ సెనేట్‌ 3.5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది.

  • అమెరికాలోని ఎన్నారైలకు పెద్ద ఊరట

  • ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ యాక్ట్‌’ ముసాయిదాలో కీలక మార్పులు చేసిన ఆ దేశ సెనేట్‌

  • రెమిటెన్స్‌ పన్ను ఒక శాతానికి తగ్గింపు

వాషింగ్టన్‌, జూన్‌ 28: అమెరికాలోని భారతీయులకు భారీ ఊరట లభించింది. అక్కడ సంపాదించి స్వదేశాలకు పంపే సొమ్ము (రెమిటెన్స్‌ల)పై ప్రతిపాదించిన పన్నును.. అమెరికా చట్టసభ సెనేట్‌ 3.5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది. అంతేకాదు అమెరికాలోని బ్యాంకు ఖాతాలు, అక్కడ జారీ అయిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా బదిలీ చేసే సొమ్మును ఈ పన్ను నుంచి మినహాయించింది. కేవలం నగదు, మనీ ఆర్డర్‌, చెక్కుల రూపంలో పంపే రెమిటెన్సులకే పన్ను వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ చట్టం’ ముసాయిదాలో సెనేట్‌ మార్పులు చేసింది. అంటే సాంకేతికంగా రెమిటెన్సులపై పన్ను దాదాపుగా లేనట్టే! అమెరికాకు వలస వచ్చిన ఉద్యోగులు, వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తున్నవారు అక్కడ సంపాదించి స్వదేశాలకు పంపే సొమ్ము (రెమిటెన్సు)లపై 5 శాతం పన్ను వేస్తామని ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ బిల్లు ప్రతినిధుల సభ ఆమోదం కూడా పొందింది. అమెరికాలో సుమారు 29 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్టు అంచనా. వారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.70 లక్షల కోట్లకు (32 బిలియన్‌ డాలర్లు)పైగా సొమ్మును భారత్‌కు రెమిటెన్సుల రూపంలో పంపినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - Jun 29 , 2025 | 05:10 AM