ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pak IMF Loan: ఫలించిన భారత్ వ్యూహం.. పాక్ కాళ్ల బేరానికి రావడానికి కారణం ఇదేనా

ABN, Publish Date - May 10 , 2025 | 08:57 PM

కాల్లుల విరమణ ఒప్పందం వెనక ఐఎమ్ఎఫ్ లోన్ లింక్ కూడా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

India Pakistan ceasefire

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధం తప్పదని అనుకుంటున్న తరుణంలో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అసలు తెర వెనుక ఏం జరిగిందీ అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. భారత దాడులతో పాక్ వణికిపోయిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. యుద్ధ భయాలతో పాక్ దివాళ అంచుకు చేరుకుంది. నిత్యావసరాల కొరతతో చివరకు పెట్రోల్ బంకులు కూడా మూసేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, పాక్ కాళ్ల బేరానికి రావడం వెనక భారత్ దౌత్యపరంగా తీసుకొచ్చిన ఒత్తిడి కూడా ఓ ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అడుక్కుతినే స్థితిలో ఉన్న పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మంజూరు చేసిన రుణం దక్కే పరిస్థితి లేకపోవడంతో పాక్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెబుతన్నారు.


కాల్పుల విరమణ కోసం పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్‌కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా ఇరు దేశాలతో తెగ చర్చలు జరిపి రాజీ కుదిర్చినట్టు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేక భికారిగా మారిన పాక్‌కు ఇటీవలే 1 బిలియన్ డాలర్ల ఐఎమ్ఎఫ్ లోన్ కూడా మంజూరైంది. ఈ లోన్ జారీపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డబ్బుతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని హెచ్చరించింది. దౌత్యపరంగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ స్థితిలో లోన్ మంజూర్ కావడంతో ఐఎమ్‌ఎఫ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణకు, లోన్ నిధుల విడుదలకు లింక్ పెట్టారట. లోన్‌లో పైసా కళ్ల చూడాలన్నా తక్షణం కాల్పుల విరమణకు అంగీకరించాలని ట్రంప్ తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఐఎమ్ఎఫ్ బోర్డులో అమెరికా కీలక సభ్య దేశం. అమెరికా అనుమతి లేనిదే పాక్ బొచ్చెలో పైసా కూడా పడదు. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాక్ చివరకు కాళ్లబేరానికి వచ్చి భారత్‌ ముందు కాల్పుల ఒప్పందం ప్రస్తావన తెచ్చిందట.

ఇవి కూడా చదవండి

కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్థాన్

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 09:23 PM