Pakistan Ceasefire Agreement: కాల్పుల విరమణకు అంగీకరించాం: పాకిస్థాన్
ABN , Publish Date - May 10 , 2025 | 06:04 PM
భారత్ తో కాల్పుల విరమణకు పాక్ అంగీకరించినట్టు దాయాది దేశ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టు పాక్ ప్రకటించింది. తక్షణం కాల్పులను విరమించేందుకు భారత్ కూడా అంగీకరించిందని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. ‘‘పాక్, భారత్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన, భద్రతకు పాక్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది. తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా శాంతిస్థాపనకు ప్రయత్నిస్తుంది’’ అని ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి ఓ పోస్టు పెట్టారు.
కొద్ది సేపటి క్రితం వరకూ భారత్, పాక్ మధ్య తీవ్రస్థాయి ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే. మూడు రోజుల నుంచీ పాక్ మిసైళ్లను ధ్వంసం చేస్తున్న భారత్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై జరిగే ప్రతి ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా భావిస్తామని భారత వర్గాలు పేర్కొనడం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. భారత్ భారీ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, యుద్ధం తప్పదని అనుకుంటున్న తరుణంలో భారత్, పాక్ యుద్ధ ప్రకటనకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు పేర్కొనడం ఆ వెంటనే పాక్ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియానే మొదట చొరవ చూపాలి: మెహబూబా ముఫ్తీ
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..
భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి