Operation Sindoor: ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియానే మొదట చొరవ చూపాలి: మెహబూబా ముఫ్తీ
ABN , Publish Date - May 10 , 2025 | 03:19 PM
ఉపఖండంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మొదట చొరవ చూపించాలని, నాయకత్వ పాత్రను పోషించాలని మెహబూబా ముఫ్తీ అన్నారు. సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే భారత్ నిజమైన శక్తి అని చాటిచెప్పేందుకు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూ యుద్ధం దిశగా అడుగులు పడుతుండటంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఖండంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మొదట చొరవ చూపించాలని, నాయకత్వ పాత్రను పోషించాలని అన్నారు. సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే భారత్ నిజమైన శక్తి అని చాటిచెప్పేందుకు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.
India Pakistan Tensions: పాకిస్తాన్ సంచలన ప్రకటన..ఈ షరతుతో దాడులకు బ్రేక్..
భారత్, పాక్ మధ్య పరస్పర దాడులపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేసి భారత్‌తో పెరిగిన ఉద్రికత్తలను తగ్గించుకోవాలని కోరిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉగ్రిత్తల విషయంలో ఒక దశదాటి జోక్యం చేసుకోలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారని, ఇప్పుడు మార్కో రూబియో సైతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరారని ముఫ్తీ తెలిపారు. నిలకడలేని అంతర్జాతీయ మద్దతు వైపు మొగ్గడానికి బదులు, ఉద్రిక్తతలు తొలగేందుకు భారత్ మొదటి అడుగు వేయాలని ఆమె సూచించారు.
''భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. అలాంటి భారత్ నిలకడలేని అంతర్జాతీయ మద్దతుపై ఆధారపడకూడదు. దీనికి బదులుగా ఉపఖండంలో నాయకత్వ పాత్రను పోషిస్తూ ఉద్రిక్తతలు తగ్గించేందుకు తొలి అడుగు వేయాలి'' అని ముఫ్తీ సూచించారు. ఇప్పుడు ప్రపంచమంతా మన వైపే చూస్తోందని, భారత్ ఉన్నతంగా నిలబడి సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే నిజమైన బలమని, న్యూక్లియర్స్ కాదని చాటాలని అన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి