ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Justice Yashwant Varma: జస్టిస్‌ వర్మ అభిశంసన లోక్‌సభలోనే!

ABN, Publish Date - Jul 26 , 2025 | 02:51 AM

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన..

  • నోటీసును రాజ్యసభ అనుమతించలేదట!

  • అధికార వర్గాల పేరుతో ప్రభుత్వం వెల్లడి

  • లోక్‌సభ సభ్యులతోనే విచారణ కమిటీ

  • అభిశంసన అన్ని పార్టీల నిర్ణయం: రిజిజు

  • ధన్‌ఖడ్‌కు వీడ్కోలు విందు యోచనలో విపక్షం.. ఆయన హాజరు అనుమానమే

  • ఆగస్టులోగా కొత్త ఉప రాష్ట్రపతి: ఈసీ

న్యూఢిల్లీ, జూలై 25: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానం కోసం లోక్‌సభలో బీజేపీ, రాజ్యసభలో కాంగ్రెస్‌ నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకొని అధికార పార్టీ ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ అదేరోజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త ఉప రాష్ట్రపతి వచ్చేవరకు రాజ్యసభ నిర్వహణ బాధ్యత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం కాంగ్రెస్‌ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అనుమతించలేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం కాంగ్రెస్‌ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అనుమతించలేదని చెబుతోంది. దాంతో బీజేపీ కోరుకున్నట్లు లోక్‌సభలో బీజేపీ ఆధ్వర్యంలో జస్టిస్‌ వర్మ అభిశంసన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించింది. 21వ తేదీన లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఒకేసారి అభిశంసన తీర్మానం నోటీసులను అందుకున్న నేపథ్యంలో చట్టం ప్రకారం ఇరు సభల సభ్యులతో కలిపి విచారణ కమిటీ వేయాల్సి ఉంటుందని జగదీప్‌ ధన్‌ఖడ్‌ అదేరోజు ప్రకటించారు. అయితే, ఇప్పుడు రాజ్యసభలో నోటీసే లేనందున రెండు సభల్లో కలిపి విచారణ కమిటీ వేయడం ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు లోక్‌సభలో చేపట్టాలని నిర్ణయించడంతో అన్నీ లోక్‌సభ ద్వారా జరగనున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలన్న ఉద్దేశాన్ని జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యక్తపరచి ఉంటే రాజ్యసభలో బీజేపీ ఎంపీలే చొరవ తీసుకొని సంతకాలు పెట్టించే వారని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్‌ చేతుల్లో పెట్టడంపైనే తమ అభ్యంతరమని బీజేపీ వర్గాలు తెలిపాయి. జస్టిస్‌ వర్మను ఇంటికి పంపాలన్నది అన్ని పార్టీలు తీసుకున్న నిర్ణయమని, లోక్‌సభ నోటీసును బీజేపీ చేపట్టినప్పటికీ అన్ని పార్టీల వారు సంతకాలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. లోక్‌సభలో తీర్మానం తర్వాత రాజ్యసభ ఈ అంశాన్ని చేపడుతుందన్నారు. మరోపక్క ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టింది. ఆగస్టు నెలాఖరుకు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారని ఈసీ వర్గాలు తెలిపాయి.

ధన్‌ఖడ్‌కు విపక్షం వీడ్కోలు?

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు వీడ్కోలు కార్యక్రమం చేపట్టడానికి అధికార పక్షం సిద్ధంగా లేని నేపథ్యంలో విపక్షమే ఆయనకు వీడ్కో లు విందు కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది. బీజేపీ ఇష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అభిశంసన నోటీసును చేపట్టి అధినాయకత్వం ఆగ్రహానికి గురైన ధన్‌ఖడ్‌ సోమవారం హడావిడిగా రాజీనామా చే సి వెళ్లిపోయారు. ఆయనకు రాజ్యసభలో తుది ప్రసంగం చేసే అవకాశం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు జరిగిన అవమానాన్ని ప్రజల దృ ష్టికి తీసుకెళ్లేందుకైనా ఆయనకు విందు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ యో చిస్తోంది. అయితే, ఈవిందుకు ధన్‌ఖడ్‌ వస్తారా? అన్నది అనుమానమే.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:51 AM