ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యూజీసీ డిఫాల్టర్‌ జాబితాలో ఐఐటీ హైదరాబాద్‌

ABN, Publish Date - Jun 30 , 2025 | 05:02 AM

ర్యాగింగ్‌ను అరికట్టేందుకు నిబంధనలు పాటించని 4 ఐఐటీలు, 3 ఐఐఎంలను యూజీసీ డిఫాల్టర్‌ జాబితాలో చేర్చారు. అధికారిక వర్గాల సమాచారం మేరకు.. ఈ జాబితాలో...

న్యూఢిల్లీ, జూన్‌ 29: ర్యాగింగ్‌ను అరికట్టేందుకు నిబంధనలు పాటించని 4 ఐఐటీలు, 3 ఐఐఎంలను యూజీసీ డిఫాల్టర్‌ జాబితాలో చేర్చారు. అధికారిక వర్గాల సమాచారం మేరకు.. ఈ జాబితాలో ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ పలక్కాడ్‌, ఐఐఎం బాంబే, ఐఐఎం రోహ్‌టక్‌, ఐఐఎం తిరుచిరాపల్లి ఉన్నాయి. అలాగే ఎయిమ్స్‌ రాయబరేలి, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌-ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, హర్యాణా కూడా ఉన్నాయి. ర్యాగింగ్‌ కట్టడికి చర్యలు తీసుకుంటామన్న తప్పనిసరి హామీపత్రం సమర్పించనందుకు దేశవ్యాప్తంగా 89 విద్యా సంస్థలకు యూజీసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. డిఫాల్టర్‌ జాబితాలో ముఖ్యమైన 17 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. యూజీసీ మార్గదర్శకాల మేరకు విద్యా సంస్థలలో ర్యాగింగ్‌ నిరోధానికి ఫిర్యాదులు స్వీకరించడానికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడం, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి మానిటరింగ్‌ ఏజెన్సీని నియమించడం వంటి చర్యలు తీసుకోలేదని యూజీసీ సెక్రటరీ మనీశ్‌ జోషి వెల్లడించారు. ఆయా విద్యా సంస్థలు 30 రోజుల్లో ర్యాగింగ్‌ కట్టడికి నిబంధనలు అమలు చేయకపోతే యూజీసీ గ్రాంట్లు, నిధులు వెనక్కి తీసుకోవడం వంటి చర్యలు తీసుకుంటామని యూజీసీ హెచ్చరించింది.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 05:02 AM