Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది
ABN, Publish Date - May 12 , 2025 | 04:16 AM
భారత వైమానిక దళం 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడులు పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అత్యంత కచ్చితంగా నిర్వహించబడ్డాయి. దేశ ప్రయోజనాల కోసమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఐఏఎఫ్ తెలిపింది.
మాకు అప్పగించిన బాధ్యతలను కచ్చితత్వంతో
నిర్వర్తించాం: భారత వైమానిక దళం
న్యూఢిల్లీ, మే 11: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమకు అప్పగించిన బాధ్యతలను కచ్చితత్వంతో పూర్తి చేశామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్, పీవోకేల్లోని 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసినట్లు తెలిపింది. దేశ ప్రయోజనాల కోసమే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, అదింకా కొనసాగుతూనే ఉందని ఆదివారం ఐఏఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆపరేషన్ కొనసాగుతున్నందున పూర్తి వివరాలను వెల్లడించలేమని.. త్వరలోనే సమగ్ర సమాచారం అందిస్తామని తెలిపింది. అనధీకృత సమాచారాన్ని, ఊహాగానాలను నమ్మొద్దని కోరింది.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్
Updated Date - May 12 , 2025 | 04:17 AM