Shashi Taroor: ఐరాస సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - May 06 , 2025 | 05:13 PM
సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని పాక్ అనుకుంటుందని, అయితే సభ్యుదేశాలు పాక్‌ను కఠిన ప్రశ్నలు వేస్తాయని, ముఖ్యంగా పహల్గాం ఘటనను తామే బాధ్యులమని తొలుత లష్కరే తొయిబా ప్రకటించడం గురించి నిలదీయాలని మన అంచనాగా ఉంటుందని శశిథరూర్ అన్నారు.
తిరువనంతపురం: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై చర్చించేందుకు సోమవారం రాత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు సమావేశం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, యూఎన్ మాజీ దౌత్యవేత్త శశిథరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా మామూలేనని, సమావేశం వల్ల ప్రత్యేకంగా జరిగేది ఏమీ ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశారు. ఇదంతా ''విచారకరమైన వాస్తవం'' అంటూ వ్యాఖ్యానించారు.
Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్
''నేను చాలా కచ్చితంగా ఒక విషయం చెప్పగలను, పాకిస్థాన్‌ను విమర్శిస్తూ కౌన్సిల్ ఎలాంటి తీర్మానం చేయదు. ఎందుకంటే చైనా దానిని వీటో చేస్తుంది. అలాగే మనను (భారత్) విమర్శిస్తూ కూడా తీర్మానం చేయరు. ఎందుకంటే దానినికూడా చేలా దేశాలు అడ్డుకుంటాయి. వీటో కూడా చేయొచ్చు. శాంతి కోసం పిలుపునివ్వడం, ఉగ్రవాదం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం వంటి మాటలే ఉంటాయి. అందుకు మించి ఏమీ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఇదంతా విచారకరమైని వాస్తవం'' అని శశిథరూర్ చెప్పారు.
సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని పాక్ అనుకుంటుందని, అయితే సభ్యుదేశాలు పాక్‌ను కఠిన ప్రశ్నలు వేస్తాయని, ముఖ్యంగా పహల్గాం ఘటనను తామే బాధ్యులమని తొలుత లష్కరే తొయిబా ప్రకటించడం గురించి నిలదీయాలని మన అంచనాగా ఉంటుందని శశిథరూర్ అన్నారు. కాగా, ఐరాసా భదత్రా మండలి క్లోజ్డ్‌డోర్ సమావేశానికి సంబంధించి ఇటు భద్రతా మండలి నుంచి కానీ, ఇండియా నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం
For National News And Telugu News
Updated Date - May 06 , 2025 | 05:15 PM