ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

ABN, Publish Date - Mar 21 , 2025 | 08:27 PM

ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందిచాలని తమిళనాడు ప్రభుత్వా్న్ని తాము రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరనే కారణంగా ఆ పని చేయడం లేదని అమిత్‌షా అన్నారు.

న్యూఢిల్లీ: హిందీ భాష ఏ భాషకూ పోటీ కాదని, అన్ని భాషలకూ హిందీ సోదర భాష అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. త్రిభాషా ఫార్ములాను డీఎంకే వ్యతిరేకిస్తున్న క్రమంలో ఆయన రాజ్యసభలో శుక్రవారంనాడు వివిధ అంశాలపై మాట్లాడుతూ, రాజకీయంగా లబ్ధిపొందేందుకు, అవినీతిని దాచిపెట్టేందుకు కొన్ని పార్టీలు భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయని అన్నారు. భాష పేరుతో దేశ విభజన జరగబోదన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందిచాలని తమిళనాడు ప్రభుత్వా్న్ని తాము రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరనే కారణంగా ఆ పని చేయడం లేదన్నారు. తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్, ఇంజనీరింగ్ కోర్టులను తమిళంలో అందిస్తామని చెప్పారు.

Amit Shah: వచ్చే ఏడాది ఇదేరోజుకి నక్సల్స్‌ని ఏరేస్తాం


''భాష పేరుతో దేశంలో విభజన తీసుకురావాలనుంటున్న వారి ఎజెండా ఎంతమాత్రం అమలు కాదు. భారతీయ భాషల వినియోగం పెరగాలనే ఉద్దేశంతోనే అధికార భాషా శాఖ కింద ఇండియన్ లాంగ్వేజ్‌ సెక్షన్‌ను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ, బెంగాలీ తదితర భాషలన్నింటికీ ప్రాచుర్యం కల్పించడమే దీని ఉద్దేశం. కొందరు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు భాష పేరును ఉపయోగించుకుంటున్నారు. వాళ్లేం చెబుతున్నారు? దక్షిణాది భాషలకు కేంద్రం వ్యతిరేకమని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం? నేను గుజరాత్ నుంచి వచ్చాను. నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి వచ్చారు. మేము దీనిని ఎందుకు వ్యతిరేకిస్తాం?'' అని అమిత్‌షా ప్రశ్నించారు. డీఎంకే తప్పిదాలను బీజేపీ ఎండగట్టేందుకు ప్రతి గ్రామగ్రామంలోనూ పర్యటిస్తుందని, ప్రజలతో మాట్లాడుతుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి

MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే

Read Latest National News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 08:28 PM