ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harsh Goenka: సామాన్యుడి ప్రాణానికి టీ కప్పుకున్న విలువ కూడా లేదా: హర్ష్ గోయెంకా ఆగ్రహం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:35 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్ 11 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 50 మందికి పైగా సామాన్యులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొల్పింది.

Harsh Goenka fires on Chinnaswamy stampede

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ టైటిల్ (IPL 2025) గెలిచిన నేపథ్యంలో బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్ 11 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 50 మందికి పైగా సామాన్యులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొల్పింది. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు (Chinnaswamy stampede).


ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) తాజాగా ఈ విషాద ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాలో తొక్కిసలాట, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట, తాజాగా బెంగళూరులో తొక్కిసలాట.. ఆ ఘటనలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి. కానీ, ఇంతవరకు ఎవరూ ఆయా ఘటనలపై బాధ్యతలు తీసుకోలేదు. ఎవరూ రాజీనామాలు చేయలేదు. మనదేశంలో సామాన్యుడి ప్రాణానికి ఉన్న విలువ ఇంతేనా? సామాన్యుడి ప్రాణం ఛాయ్ కప్పు కంటే చౌకగా మారిందా. ఈ ఘటన తర్వాత కూడా ఏమీ మారదు అని హర్ష్ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు.


హర్ష్ గోయెంకా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలీసులు, సంబంధిత నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లే వ్యక్తులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మరికొందరు అన్నారు.


ఇవి కూడా చదవండి..

Virat Kohli: ఆ విషాదం గురించి కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు.. అందుకే సంబరాలు: అతుల్ వాసన్


BSF Jawan Kidnapped: బీఎస్‌ఎఫ్ జవాన్‌ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశ్ వాసులు


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 12:35 PM