Virat Kohli: ఆ విషాదం గురించి కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు.. అందుకే సంబరాలు: అతుల్ వాసన్
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:27 AM
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు.
దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ (IPL 2025) గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది. బుధవారం జరిగిన విక్టరీ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. అంతటి విషాదం తర్వాత కూడా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి (chinnaswamy stadium stampede).
అంతటి విషాదాన్ని పట్టించుకోకుండా సంబరాలు చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యంపై, విరాట్ కోహ్లీ (Virat Kohli)పై, ఆటగాళ్లపై అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఘటనపై మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ స్పందించారు. ఆ విషయం కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. `విజయోత్సవాలు చేసుకుంటున్న సమయంలో ఆ తొక్కిసలాట గురించి కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు. రాజకీయ నాయకులు, ఫ్రాంఛైజీ యాజమాన్యం తమ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. ఆ విషయం తెలిసినా పట్టించుకోరు. అయితే ఆటగాళ్లు అలా ప్రవర్తిస్తారని నేను అనుకోను` అంటూ అతుల్ వాసన్ అన్నాడు.
విజయోత్సవాల సమయంలో తొక్కిసలాట గురించి తెలిస్తే కోహ్లీ, ఇతర ఆటగాళ్లు కచ్చితంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయేవారని వాసన్ అన్నాడు. కాగా, ఈ సంఘటన తర్వాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. తన సంతాపాన్ని తెలియజేశాడు. అందరూ క్షేమంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనపై ఆర్సీబీ మాజీ ఆటగాడు డివిల్లీర్స్ కూడా సంతాపం వ్యక్తం చేశాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి