Chennai News: ఇప్పటికీ మాసిపోని విభజన గాయాలు..
ABN, Publish Date - Aug 15 , 2025 | 12:09 PM
ప్రతియేటా ఆగస్టు 14న భారతదేశం తన ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటనను బాధతో గుర్తు చేసుకుంటోందని, భారతదేశం రెండు ముక్కలైన సందర్భంగా ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదని గవర్నర్ ఆర్‌ఎన్ రవి పేర్కొన్నారు.
- రాష్ట్రంలో పాలకుల అండతోనే మాదకద్రవ్యాల వాడకం
- గవర్నర్ ఆర్‌ఎన్ రవి
చెన్నై: ప్రతియేటా ఆగస్టు 14న భారతదేశం తన ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటనను బాధతో గుర్తు చేసుకుంటోందని, భారతదేశం రెండు ముక్కలైన సందర్భంగా ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governoe RN Ravi) పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఎక్స్ పేజీలో ఆయన ఓ సందేశం వెలువరించారు. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ ముస్లింలీగ్ హింసకు పాల్పడిందన్నారు.
ముస్లింలీగ్ చేత ‘కాఫీర్లు’ గా ముద్రవేయబడిన లక్షలాదిమంది తమ పూర్వీకులు వేల సంవత్సరాలుగా నివసించిన భూమి నుండి మరో ప్రాంతానికి వలసపోయారని, ఆ నాటి విభజన గాయాలు ఇంకా మానలేదన్నారు. ముసుగు కప్పుకుని ఉన్న ఇలాంటి దుష్టశక్తులు ఇప్పటికీ పెరుగుతున్నందున దేశం ఈ రోజు (ఆగస్టు 14)ను లోతైన భావోద్వేగంతో గుర్తుంచుకుంటోందన్నారు. ఆ దుష్టశక్తులు అసత్యాలతో, మోసపూరిత చర్యలతో దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ప్రజల మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
నవ్యభారతం పటిష్టభారతం అనే సంకల్పం దిశగా భారతావని పురోగమిస్తున్న ఈ తరుణంలో ఆ దుష్టశక్తులను ఎదురించేందుకు ప్రతి భారతీయుడూ ప్రత్యేకించి తమిళనాడుకు చెందిన తన సోదరసోదరీమణులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పాలకుల అండదండలతోనే మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని, వీటికి తోడు మహిళలపై లైంగిక వేధింపులు తదితర నేరాలు కూడా పెరిగాయని గవర్నర్ ఆరోపించారు.
ఇలాంటి లైంగికపరమైన నేరాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. పాలకుల ఆశీస్సులతోనే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల పంపిణీ జరుగుతోందని, గంజాయితో సహా రసాయన మాదక ద్రవ్యాల వాడకమూ పెరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌కు హానికలిగించేవారిపై నేటి యువత సాయంతో కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2025 | 12:09 PM