ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Goa Temple Stampede: గోవా దేవాలయంలో ఊరేగింపులో తొక్కిసలాటకు కారణం ఇదేనా

ABN, Publish Date - May 03 , 2025 | 10:25 AM

గోవా దేవాలయం తొక్కిసలాట వెనుక విద్యుదాఘాతం కారణమైన ఉండొచ్చన్న కథనాలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి.

Goa Temple Stampede

ఇంటర్నెట్ డెస్క్: గోవాలోని శ్రీ లరాయి మాత దేవాలయం జాతర సందర్భంగా జరిగిన ఊరేగింపులో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. ఘటనకు కారణాలను అధికారులు ఇంకా ప్రకటించినప్పటికీ విద్యుదాఘాతం దీనికి కారణమై ఉండొచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

జాతర కోసం పటిష్ఠ ఏర్పాట్లు

ఏటా నిర్వహించే ఈ జాతర కోసం ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. జనాలను నియంత్రించేందుకు వెయ్యికి పైగా పోలీసు బలగాలను మోహరించింది. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించారు. పిక్‌పాకెటింగ్ జరగకుండా మఫ్టీల్లో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. జన సందోహం అదుపు తప్పకుండా ఉండేందుకు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.


తొక్కిసలాటకు కారణం ఇదేనా

అక్కడ కనిపించిన దృశ్యాల ప్రకారం, జాతరకు వచ్చిన భక్తులు సంప్రదాయం ప్రకారం భారీ మంట ముందు నిలబడి తమ కోరికలు విన్నవించుకున్నారు. ఇలా చేస్తే తమ అభీష్టం నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మరికొందరు బొగ్గు కణికలపై నడిచి ముక్కులు చెల్లించుకున్నారు. అయితే, తొక్కిసలాట జరిగిన సమయంలో ఎవరైనా ఇలా మొక్కులు చెల్లించుకున్నారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో ఉదయం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా జన సందోహం పెరిగిపోయింది. దీంతో, భక్తు్లు గాబరా పడిపోయి ఒకరినొకరు తోసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జన సందోహ నియంత్రణ చర్యలు సరిగా లేకపోవడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


అయితే, ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుదాఘాతం జరగడంతో భక్తుల్లో కంగారు మొదలై తొక్కిసలాటకు దారి తీసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగిందనేదానిపై పూర్తిస్థాయి స్పష్టత మాత్రం రాలేదు. ఈ తొక్కిసలాటలో 17 ఏళ్ల బాలుడు కూడా మృతి చెందాడు. మరో 50 మంది గాయాలపాలయ్యారు. ఘటనలో గాయపడ్డ వారికి గోవా మెడికల్ కాలేజీ, నార్త్ గోవా డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సీఎం తెలిపారు. బాధితుల సహాయార్థం అధికారులు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ కూడ ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు సిద్ధం చేయడంతో పాటు మరో 10 అంబులెన్సులను కూడా రెడీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్

అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..

హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్

For National News And Telugu News

Updated Date - May 03 , 2025 | 10:33 AM