ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Glue Addict: గ్లూ అడిక్షన్.. బామ్మను చంపేసిన యువకుడు

ABN, Publish Date - Aug 10 , 2025 | 01:29 PM

Glue Addict: అర్బాజ్ రంజాన్ ఖురేషీ.. గ్లూ మత్తుకు అడిక్ట్ అయ్యాడు. ప్రతీ నిత్యం ఆ మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. గ్లూ కొనడానికి డబ్బులు ఇవ్వాలంటూ తరచుగా కుటుంబసభ్యుల్ని హింసిస్తూ ఉన్నాడు.

Glue Addict

మత్తు కోసం డ్రగ్స్, గంజాయి, దగ్గు సిరప్‌లు మాత్రమే కాదు.. గ్లూను కూడా వాడతారన్న సంగతి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. గ్లూలో ఓ ప్రమాదకర రసాయనం ఉంటుంది. గ్లూ వాసన చూసినపుడు అది మెదడుపై ప్రభావం చూపుతుంది. తద్వారా మనుషులు మత్తులోకి వెళ్లిపోతారు. తాజాగా, ఓ వ్యక్తి గ్లూ మత్తులో ఓ ప్రాణం తీశాడు. గ్లూ కొనడానికి డబ్బులు ఇవ్వలేదని కుటుంబసభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో నిందితుడి బామ్మ చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

బీద్ జిల్లా, పార్లీ సిటీకి చెందిన అర్బాజ్ రంజాన్ ఖురేషీ.. గ్లూ మత్తుకు అడిక్ట్ అయ్యాడు. ప్రతీ నిత్యం ఆ మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. గ్లూ కొనడానికి డబ్బులు ఇవ్వాలంటూ తరచుగా కుటుంబసభ్యుల్ని హింసిస్తూ ఉన్నాడు. శనివారం అతడు గ్లూ కొనడానికి కుటుంబసభ్యుల్ని డబ్బులు అడిగాడు. వారు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో అర్బాజ్ కోపం కట్టలు తెంచుకుంది. గ్లూ మత్తులో కత్తితో తల్లిదండ్రులు, బామ్మపై దాడి చేశాడు. ఈ దాడిలో బామ్మ జుబేదీ ఖురేషీ చనిపోయింది.

దాడి తర్వాత అతడు అక్కడినుంచి పారిపోయాడు. పొరిగిళ్ల వారు తీవ్రంగా గాయపడ్డ అతడి తల్లిదండ్రులను ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. కాగా, గ్లూ మత్తు చాలా ప్రమాదకరమైనది. దాని వల్ల వినికిడి శక్తి దెబ్బ తింటుంది. కిడ్నీలు, లివర్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. న్యూరలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

అబ్బుర పరుస్తున్న రాక్షస వంతెన..

ఆ ఘనత మా ప్రభుత్వానిదే.. అనిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Updated Date - Aug 10 , 2025 | 01:29 PM