అబ్బుర పరుస్తున్న రాక్షస వంతెన..
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:22 PM
కొన్ని నిర్మాణాలు పాఠాలుగా నిలుస్తాయి. జర్మనీలోని ‘రాకొట్జ్ బ్రిడ్జ్’ కూడా అంతే. దూరం నుంచి చూస్తే పూర్తి వలయాకారంలోని వంతెనగా అబ్బుర పరుస్తుంది. కానీ దగ్గరకి వెళితే... ఆర్చ్ మాదిరిగా ఉన్న వంతెన నీడ సరస్సులోని నీళ్లలో పడి వలయంలా భ్రమింపచేస్తుంది.
కొన్ని నిర్మాణాలు పాఠాలుగా నిలుస్తాయి. జర్మనీలోని ‘రాకొట్జ్ బ్రిడ్జ్’ కూడా అంతే. దూరం నుంచి చూస్తే పూర్తి వలయాకారంలోని వంతెనగా అబ్బుర పరుస్తుంది. కానీ దగ్గరకి వెళితే... ఆర్చ్ మాదిరిగా ఉన్న వంతెన నీడ సరస్సులోని నీళ్లలో పడి వలయంలా భ్రమింపచేస్తుంది. 1860లో పూర్తిగా రాళ్లలతో స్థానికులు దీన్ని నిర్మించారు. బ్రిడ్జ్ వంపులో ఉన్న కచ్చితత్వం, మొనదేలిన రాళ్ల తీరును బట్టి... ఇలాంటి నిర్మాణం రాక్షసులకు మాత్రమే సాధ్యమని ‘డెవిల్స్ బ్రిడ్జ్’ (రాక్షస వంతెన) అన్నారు.

ఈ బ్రిడ్జ్‌ని ఓ కళాఖండంలాగా పరిరక్షిస్తోంది అక్కడి ప్రభుత్వం. దీని మీద నడవడం అసాధ్యం. అలాగే వంతెన కింద నుంచి అటూఇటూ వెళ్లడాన్నీ నిషేధించారు. ఒక్కో కాలంలో ఒక్కో రకంగా కనువిందు చేసే ‘రాకొట్జ్ బ్రిడ్జ్’ని చూసేందుకు టూరిస్టులు వెళ్తుంటారు. సాక్సోనీ నగరంలోని ఈ మధ్యయుగాల నాటి వంతెనని చూస్తూ మైమరచిపోతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
Read Latest Telangana News and National News