Share News

Anitha:ఆ ఘనత మా ప్రభుత్వానిదే.. అనిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:10 PM

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Anitha:ఆ ఘనత మా ప్రభుత్వానిదే.. అనిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
AP Home Minister Anitha

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) అనకాపల్లి జిల్లాలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు,హోం మంత్రి అనిత పర్యటించారు. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆయకట్టు నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేసి, జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు.


తాండవ ఆయకట్టుపై ఎంతోమంది రైతులు ఆధారపడ్డారని చెప్పుకొచ్చారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. గత జగన్ ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం గేట్ల మరమ్మతులు కూడా చేయలేదని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ గేట్లు మరమ్మతులు చేయించారని తెలిపారు వంగలపూడి అనిత .


ఈ రిజర్వాయర్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీటిని ఇస్తున్నామని ఉద్ఘాటించారు. తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు ఈ రిజర్వాయర్‌పై ఆధారపడ్డారని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పలు రైళ్లు రద్దు.. గమ్యాల కుదింపు

డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

For More AP News and Telugu News

Updated Date - Aug 10 , 2025 | 01:16 PM