Share News

Justice NV Ramana: డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:49 AM

నేటి తరం యువతకు చదువు పూర్తికాగానే ఉద్యోగం సాధించి అమెరికా వెళ్లి డాలర్స్‌ సంపాదించాలనే ఆలోచనతోపాటు జీవితంలో...

Justice NV Ramana: డాలర్‌ డ్రీమ్స్‌తోపాటు జీవన నైపుణ్యాలు అవసరం

  • అమరావతి రైతుల విజయగాధ యువతకు స్ఫూర్తిదాయకం: జస్టిస్‌ ఎన్వీ రమణ

గుంటూరు(విద్య), ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నేటి తరం యువతకు చదువు పూర్తికాగానే ఉద్యోగం సాధించి అమెరికా వెళ్లి డాలర్స్‌ సంపాదించాలనే ఆలోచనతోపాటు జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమర్థంగా ఎదుర్కొనే జీవన నైపుణ్యాలు, శ్రమించే తత్వం అవసరమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. గుంటూరు సమీపంలోని చౌడవరంలోని ఆర్వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం జరిగిన పదవ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తమ హక్కుల కోసం ఐదేళ్లు పోరాడిన అమరావతి రైతుల విజయ గాధ యువతకు స్ఫూర్తి కావాలన్నారు. ఆత్మనూన్యత, అభద్రతాభావం, అశాంతి, నిర్వేదంలో తెలుగు సాహిత్యం చదివితే స్వాంతన కలుగుతుందని తెలిపారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - Aug 10 , 2025 | 05:50 AM