Satyapal Malik: జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ABN, Publish Date - Aug 05 , 2025 | 02:23 PM
ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌కు చెందిన ప్రముఖ జాట్ నేత అయిన సత్యపాల్ మాలిక్ విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1974లో చౌదరి చరణ్ సింగ్ 'భారతీయ క్రాంతి దళ్' నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. సుదీర్ఘ అస్వస్థతతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1.12 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌కు చెందిన ప్రముఖ జాట్ నేత అయిన సత్యపాల్ మాలిక్ విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1974లో చౌదరి చరణ్ సింగ్ 'భారతీయ క్రాంతి దళ్' నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జనతాదళ్ నుంచి రాజ్యసభకు, ఆ తర్వాత లోక్‌సభ ఎంపీగా అలీగఢ్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్, లోక్‌దళ్, సమాజ్‌వాదీ పార్టీలతోనూ ఆయన రాజకీయ ప్రయాణం సాగింది.
బీహార్ గవర్నర్‌గా 2017లో సత్యపాల్ మాలిక్ నియమితులయ్యారు. స్వల్పకాలం ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఏడాది తర్వాత 2018లో జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన హయాంలోనే 370 అధికరణను కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన గవర్నర్‌గా ఉన్నారు. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పూర్తికాలం పనిచేసిన అనంతరం ఆయన గోవా, ఆ తర్వాత మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.
ఇవి కూడా చదవండి..
ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
బరి తెగిస్తున్న కేటుగాళ్లు.. దేవుళ్లను కూడా వదలటం లేదు...
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 04:24 PM