Operation Sindoor: సత్తా చాటిన ఆకాశ్
ABN, Publish Date - May 16 , 2025 | 03:50 PM
Operation Sindoor: ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోనులు, క్షిపణులను భారత్ సైన్యం తిప్పికొట్టంది. అలాగే ఆపరేషన్ సిందూర్ సైతం భారత్ విజయవంతంగా నిర్వహించింది.
న్యూఢిల్లీ, మే 16: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి వేళ.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. అందుకు ప్రతిగా భారత్‌లోని సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలే లక్ష్యంగా పాక్ క్షిపణలు, డ్రోనులతో దాడులు నిర్వహించింది. ఈ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. భారత్ అంబులపొదిలోని ఆకాశ్ క్షిపణి ద్వారానే ఇది సాధ్యమైందనే వాదన సర్వత్ర వినిపిస్తోంది.
ఈ తరహా క్షిపణిని ఇప్పటి వరకు చూడలేదని శత్రు దేశమైన పాకిస్థాన్ సైతం ప్రకటించిందంటే.. ఆకాశ్ పవర్ ఏమిటో అర్థమవుతోంది. ఈ ఆకాశ్ క్షిపణి హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలో తయారయింది. ఈ ఆకాశ్ క్షిపణి తయారికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు వ్యవహరించారు. ఆ ఆకాశ్ క్షిపణికి సంబంధించిన పలు కీలక అంశాలు..
మే 9, 10 తేదీల్లో.. అది రాత్రి వేళల్లో భారత్ మిలటరీ, పౌరులు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులను ఆకాశ్ క్షిపణులు తిప్పికొట్టాయి.
భారత్‌పై పాక్ ప్రయోగించిన డ్రోనులు, క్షిపణలతోపాటు మైక్రో యూఏవీలను సైతం ఈ క్షిపణి అడ్డుకొంది. వాతావరణం, భూభాగంతోపాటు రాడార్ నుంచి డేటాను సంగ్రహించి అప్పటికప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ దాడులను ఈ క్షిపణులు తిప్పికొట్టాయి. దీంతో క్షిపణుల పని తీరు చూసి.. పాకిస్థాన్ సైతం ఒకింత ఆశ్చర్యాన్ని ప్రకటించడం గమనార్హం.
ఆకాశ్ అనేది ఆత్మ నిర్భర భారత్‌ను ప్రదర్శించే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇక చైనా నుంచి పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న హెచ్‌క్యూ 9, హెచ్‌క్యూ 16 క్షిపణులను భారత్‌కు చెందిన ఆకాశ్ క్షిపణిలు ధ్వంసం చేశాయి.
ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ. ఆ క్రమంలో శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్‌లు, డ్రోనులు, క్షిపణులను పసిగట్టడంలో ఆకాశ్‌కు ఆకాశే సాటి.
రాడార్ సిస్టమ్స్, సెన్సార్లు, కమ్యూనికేషన్ టెక్నాలజీ తదితర అంశాలు ఈ క్షిపణులతో అనుసంధానించాయి. దీంతో రియల్ టైమ్ మల్టీ సెన్సార్డ్ డేటా ప్రాసెసింగ్‌తోపాటు దాడి తీవ్రతను అంచనా వేయగలదు. ఏ దిశ నుంచి దాడులు సంభవించినా.. వాటిని ఒకే సారి ఛేదించగలగడం ఈ ఆకాశ్ క్షిపణుల యొక్క ప్రత్యేకత.
ఈ క్షిపణులకు ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు ఇవి..
రేంజ్- 25-30 కి.మీ (ఆకాశ్ Mk-I), 70 కి.మీ వరకు (ఆకాశ్ Mk-II)
కవరేజ్- 30 మీ నుంచి 20 కి.మీ
స్పీడ్- సూపర్‌సోనిక్ (Mach 2.5- 3.5)
వార్‌హెడ్- సుమారు 60 కిలోల బరువు
గైడెన్స్ సిస్టమ్- దశల వారీగా కమాండ్ గైడెన్స్
రాడార్- రాజేంద్ర రాడార్ (లక్ష్య సాధన, కోసం)
లాంచ్ ప్లాట్‌ఫామ్- మొబైల్ లాంచర్లు (ట్రక్ లేదా వాహనాలు)
టార్గెట్- డ్రోన్లు, ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు
వేరియంట్లు- ఆకాశ్ Mk-I, ఆకాశ్ Mk-IIతోపాటు అప్డేటెడ్ వర్షన్ ఆకాష్-NG
ఈ వార్తలు కూడా చదవండి..
Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..
Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు
Updated Date - May 16 , 2025 | 04:46 PM