ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Explision Container Ship: కంటైనర్ షిప్‌లో పేలుడు.. రంగంలోకి నేవీ

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:04 PM

కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు.

Singapore flagged container ship

కొచ్చి: సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్‌లో సోమవారం ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఉదయం 10.30 గంటల ప్రాంతానికి ఎంవీ వాన్ హై 503 నౌక కేరళ తీరానికి సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే భారత నావికాదళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

కొలంబో నుంచి ఈ నెల 7న బయలు దేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసి ఉంది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణశాఖ పీఆర్ఓ తెలిపారు. ఐఎన్ఎస్ గరుడ నుంచి డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ సోర్టీని కూడా రంగంలోకి దింపారు.

నౌక మంటల్లో చిక్కుకోవడంతో అందులోని 22 మంది సిబ్బందిలో 18 మంది షిప్‌ను వదిలి లైఫ్‌బోట్‌లతో బయటపడ్డారు. వారిని ఇండియన్ నేవీ, కోస్ గార్డులు సురక్షితంగా తీరానికి చేర్చారు.

ఇవి కూడా చదవండి..

ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి

మోదీ పాలనపై జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 03:13 PM