Shashi Tharoor: ఎమర్జెన్సీ.. మాయని మచ్చ
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:12 AM
భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని, ఆ కాలాన్ని ఒక చీకటి అధ్యాయం గా మాత్రమే గుర్తుంచుకోకూడదని, దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ అన్నారు.
నాడు క్రూరత్వం రాజ్యమేలింది
గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా వేసెక్టమీ ఆపరేషన్లు చేయించిన సంజయ్‌గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్
న్యూఢిల్లీ, జూలై 10: భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని, ఆ కాలాన్ని ఒక చీకటి అధ్యాయం గా మాత్రమే గుర్తుంచుకోకూడదని, దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన రాసిన వ్యాసం ఓ మలయాళ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైంది. ఇందిరా గాంధీ పాలనలో అధికార దుర్వినియోగం, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ, మురికివాడల తొలగింపు తదితర అంశాలను అందులో ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘‘అప్పట్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో వేసెక్టమీపై ప్రచా ర కార్యక్రమాలు నిర్వహించి, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారు. ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఆయుధంగా ఉపయోగించారు. ఇలాంటి చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయి. ఇవ న్నీ భార త రాజకీయాల్లో మాయని మచ్చలా మిగిలిపోయాయి. నాటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని శశి థరూర్ పేర్కొన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 04:12 AM