ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elction Commission: రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. తప్పుపట్టిన ఈసీ

ABN, Publish Date - Aug 01 , 2025 | 04:36 PM

ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చౌర్యంపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకోసం 6 నెలలు పట్టిందని చెప్పారు.

Election Commission-Rahul Gandhi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఏవిధంగా ఓట్ల చోరీ (Vote Fraud) జరిగిందో బిహార్‌లోనూ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం నాడు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, బాధ్యతా రహితమని పేర్కొంది. ప్రతిరోజూ వచ్చే ఇలాంటి బెదిరింపులను తాము పట్టించుకోమని తెలిపింది. పారదర్శకంగా పని చేస్తూ రాహుల్ వంటి వారు చేస్తున్న బాధ్యతారహిత వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని తమ అధికారులకు కూడా చెప్పామని ఈసీ స్పష్టం చేసింది.

రాహుల్ ఏమన్నారు?

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. 'ఓట్ల చోరీ జరుగుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందనడానికి మా దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయి. 100 శాతం సాక్ష్యాలున్నాయి. మేము వాటిని బహిరంగ పరిస్తే ఈసీ ఏధంగా ఓట్ల చోరీ చేస్తోంది, ఎవరి కోసం చేస్తోందనేది యావద్దేశానికి తెలుస్తుంది' అని రాహుల్ అన్నారు. బీజేపీ కోసమే ఈసీ ఈ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఆటం బాంబ్

ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చోరీపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందని రాహుల్ తెలిపారు. ఇందు కోసం 6 నెలలు పట్టిందన్నారు. 'అటం బాంబు' వంటి వివరాలు వెలికితీశామని, ఆ బాంబు పేలితే ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 01 , 2025 | 05:09 PM