ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: బీహార్‌లో ఓట్ల చోరీకి కుట్ర.. ఈసీపై రాహుల్ విమర్శలు

ABN, Publish Date - Jul 11 , 2025 | 06:26 PM

భువనేశ్వర్‌లో శుక్రవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావో సమావేశ్'లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, బీజేపీ వింగ్‌గా ఈసీఐ పని చేస్తోందని అన్నారు.

Rahul Gandhi

భువనేశ్వర్: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. బీహార్‌లో 'ఎన్నికల చోరీ' (Election theft)కి ఈసీ కుట్ర పన్నుతోందని అన్నారు. భువనేశ్వర్‌లో శుక్రవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావో సమావేశ్'లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ వింగ్‌గా ఈసీఐ పని చేస్తోందని అన్నారు. మహారాష్ట్రలో చేసినట్టే బీహార్‌లోనూ ఎన్నికల చోరీకి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

'రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోంది. నిన్న నేను బీహార్‌లో ఉన్నాను. మహారాష్ట్రలో ఏవిధంగా అయితే ఎన్నికల చోరీ జరిగిందో బీహార్‌లోనూ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల చోరీకి ఈసీ కొత్త కుట్ర చేస్తోంది. ఈసీ ఏ పని చేయాలో అది చేయకుండా బీజేపీ వింగ్‌ తరహాలో పనిచేస్తోంది' అని రాహుల్ విమర్శించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి జరిగిన నష్టంపై మాట్లాడుతూ, కొత్తగా కోటి మంది ఓటర్లను అప్పుడు చేర్చారని అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కొత్తగా కోటి ఓటర్లు వచ్చి చేరారని, వీళ్లంతా ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ తెలియదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా, వీడియోగ్రఫీ తమకు ఇవ్వాల్సిందిగా ఎన్నోసార్లు ఈసీని కోరినా నిరాకరించిందని చెప్పారు.

ఒడిసా సర్కార్‌పై విమర్శలు

పేద ప్రజలను ఒడిశా ప్రభుత్వం దోచుకుంటోందని రాహుల్ విమర్శించారు. ఇంతకుముందు బీజేడీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే పని చేస్తు్న్నాయని అన్నారు. ఒకవైపు ఒడిశా పేద ప్రజలు, దళితులు, వెనుకబడిన తరగతులు, రైతులు, కార్మికులు ఉంటే మరోవైపు ఐదారుగురు బిలియనీర్లు, బీజేపీ ప్రభుత్వం ఉన్నాయని చెప్పారు. వీరి మధ్య పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు మాత్రమే దీనిపై పోరాడుతున్నారని చెప్పారు.

గౌతమ్ అదానీ కోసమే రథాలను ఆపారు..

రథయాత్ర సందర్భంగా పూరీ జగన్నాథుని రథాలను గౌతమ్ అదానీ కోసమే ఆపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 'ఒడిశా ప్రభుత్వాన్ని అదానీ నడుపుతున్నారు. అదానీ నరేంద్ర మోదీని నడుపుతున్నారు. జగన్నాథుని రథాలను లాగుతున్నప్పుడు లక్షలాది మంది అందులో పాల్గొన్నారు. అప్పుడొక డ్రామా జరిగింది. అదానీ, ఆయన కుటుంబ సభ్యుల కోసం రథాలను ఆపారు. దీనిని బట్టే ఒడిశా ప్రభుత్వం గురించి అందరూ అర్ధం కోవచ్చుకోవచ్చు' అని రాహుల్ చెప్పారు.

మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు

భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:32 PM