ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Voter List Revision: ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డుగుర్తింపు కోసమే..

ABN, Publish Date - Jul 23 , 2025 | 03:27 AM

ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డు, రేషన్‌ కార్డు కేవలం గుర్తింపు కోసమేనని ఎన్నికల కమిషన్‌(

  • బిహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ఈసీ వివరణ

న్యూఢిల్లీ, జూలై 22: ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డు, రేషన్‌ కార్డు కేవలం గుర్తింపు కోసమేనని ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) స్పష్టం చేసింది. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ-- స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌)పై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సమాధానంగా ఈసీఐ మంగళవారం ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎస్‌ఐఆర్‌ ద్వారా ఓటర్ల జాబితా శుద్ధీకరణ జరుగుతోందని.. దీనివల్ల అర్హత లేని వ్యక్తులను జాబితా నుంచి తొలగించడం సాధ్యమవుతుందని ఆ అఫిడవిట్‌లో వివరించింది. ఈ చర్యతో భారత రాజ్యాంగంలోని 19వ అధికరణకు భంగం కలుగుతుందనే పిటిషనర్ల వాదనలను ఖండిస్తూ.. ఎన్నికల ప్రక్రియను నిర్దేశించే ప్రకరణలు, చట్టాలను గురించి వివరించింది. ఈ క్రమంలోనే ఆధార్‌, ఓటర్‌ఐడీ, రేషన్‌ కార్డులను కేవలం గుర్తింపు ప్రయోజనాలకే పరిమితంగా వాడుతున్నట్లు తెలిపింది. ‘‘ఆధార్‌ అనేది పౌరసత్వానికి లేదా నివాస ధ్రువీకరణకు ఆధారం కాదు. ఈ విషయాన్ని ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 9 స్పష్టం చేస్తోంది’’ అని ఈసీ తన అఫిడవిట్‌లో గుర్తుచేసింది.

52 లక్షల మంది పేర్లు తొలగింపు

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణలో 52 లక్షల మంది పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 18 లక్షల మంది మరణించినట్లు గుర్తించామని, మరో 26 లక్షల మంది ఇత ర నియోజకవర్గాలకు మారారని వివరించింది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న 7 లక్షల మంది ని తొలగించి, ఒకేచోట అవకాశం కల్పించినట్లు తెలిపింది. మరో 21.36 లక్షల మంది ఆచూకీ తెలియరావడం లేదని, వారిని వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:27 AM